వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Bigg Boss OTT : బిగ్ బాస్ ఓటీటీకి సర్వం సిద్దం… లీకైన కంటస్టెంట్స్ లిస్ట్ !

Bigg Boss OTT : తెలుగు బుల్లితెరపై ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకాదరణను అందుకుని బిగ్గెస్ట్ రియాలిటీ షోగా నిలిచింది ” బిగ్ బాస్ “. తక్కువ సమయంలోనే విశేషమైన రెస్పాన్స్‌ను దక్కించుకుని సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది ఈ షో. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోని త్వరలోనే కొత్త సీజన్ కు రెడీ అవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌తో నిర్వహకులు సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ... Read more

By Ramesh Babu

Published on: January 31, 2022 6:15 PM

Updated on: January 31, 2022 6:48 PM

---Advertisement---

Bigg Boss OTT : తెలుగు బుల్లితెరపై ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకాదరణను అందుకుని బిగ్గెస్ట్ రియాలిటీ షోగా నిలిచింది ” బిగ్ బాస్ “. తక్కువ సమయంలోనే విశేషమైన రెస్పాన్స్‌ను దక్కించుకుని సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది ఈ షో. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోని త్వరలోనే కొత్త సీజన్ కు రెడీ అవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌తో నిర్వహకులు సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. దీనికి కూడా అక్కినేని నాగార్జునే హోస్టుగా చేయబోతున్నారు.

ఫిబ్రవరి 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో బిగ్‌బాస్‌ షో స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి ప‌లు వివ‌రాలు లీక్ అవుతున్నాయి. గ‌తంలో బిగ్‌బాస్‌లో అల‌రించిన వారిని కూడా ఈ సారి మ‌ళ్లీ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే పలువురు మాజీ కంటెస్టెంట్లను తీసుకున్నారని స‌మాచారం. వారిలో అరియానా గ్లోరీ కూడా ఉంద‌ని తెలుస్తోంది. ఆమెతో పాటు మాజీ కంటెస్టెంట్స్‌ ఆదర్శ్, తనీశ్‌, అఖిల్, అలీ రెజా, హరితేజను కూడా ఈ సారి బిగ్‌ బాస్‌ లోకి తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

కొత్త‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న వారిలో యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ శివ, ఢీ-10 విజేత రాజు, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్’వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ వైష్ణవి, సోషల్‌ మీడియా స్టార్‌ వరంగల్‌ వందన, యాంకర్‌ ప్రత్యూష కూడా ఈ సారి బిగ్‌బాస్‌లో అల‌రించనున్న‌ట్లు స‌మాచారం. మొత్తం 82 రోజుల పాటు సాగనుందని తెలుస్తోంది. ఇక, ఇందులో 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel