Bigg Boss 6 : బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ లాంచ్ ప్రోమో వచ్చేసింది.. వీడియో!

Bigg Boss 6 : తెలుగు టీవీ ఆడియోన్స్‌ను అలరించేందుకు బిగ్‌బాస్ మళ్లీ వస్తున్నాడు. ప్రతి ఏడాదిలోనే ఈసారి కూడా బిగ్‌బాస్ సీజన్ మరింత అలరించనుంది. బిగ్‌బాస్ సీజన్ 6 మొదలు కాబోతోంది. అతిత్వరలోనే ఈ షో ప్రారంభం కానుంది. బిగ్ బాస్ 6లో పాల్గొనే కంటెస్టంట్ల లిస్టు కూడా తయారైంది. దీనికి సంబంధించిన లిస్టు కూడా రెడీ అయింది. దీనికి సంబంధించి నిర్వాహకులు ప్రోమోను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ 6 ప్రోమో లోగో విడుదల చేశారు. గ్రాండ్ లాంచ్ ప్రోమో రిలీజ్ చేయడంతో ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

bigg-boss-6-biggboss-6-grand-launch-promo-released-today
bigg-boss-6-biggboss-6-grand-launch-promo-released-today

గత మూడు సీజన్ల నుంచి బిగ్ బాస్ హోస్టుగా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ఈసారి కూడా బిగ్ బాస్ 6 సీజన్ హోస్టుగా నాగార్జున వ్యవహరిస్తున్నాడు. లేటెస్టుగా రిలీజ్ అయిన ప్రోమోలో నాగార్జున ఎంట్రీ సీన్ అదిరింది. ఇక వెయిటింగ్ చాలని.. గ్రాండ్ ఓపెనింగ్ ప్రోమోను చూపించారు. బిగ్ బాస్ సీజన్ 6 జోష్ మొదలైంది. ఈ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఒక పెద్ద లిస్టు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పటిలానే ఈసారి కూడా యూట్యూబర్స్, సోషల్ మీడియా సెలబ్రిటీలతో టీవీ-సినీ ఆర్టిస్ట్‌లను బిగ్‌బాస్ సీజన్ 6 సీజన్ కోసం సెలెక్ట్ చేశారనే టాక్ నడుస్తోంది.

బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌ లో పాల్గొన్న ఆర్జే చైతు, యాంకర్ శివ, మిత్రా శర్మలలో బిగ్‌బాస్ సీజన్ 6లో సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. సంజనా చౌదరి, ఆశా సైనీ, యూట్యూబర్ కుషిత కల్లపు, జబర్దస్త్ వర్ష, యాంకర్ మంజూష, సింగర్ మోహన భోగరాజు, సుమన్ టీవీ యాంకర్లు మంజూష, రోషన్, కొరియోగ్రాఫర్ పొప్పి మాస్టర్, సీరియల్ నటి కరుణ భూషన్, వలయం మూవీ ఫేమ్ లక్ష్య్ చదలవాడ, సీరియల్ నటుడు కౌశిక్, యాక్టర్ శ్రీహాన్, మిడిల్ క్లాస్ మెలొడీస్ ఫేమ్ చైతన్య గరికపాటి పేర్లు వినిపిస్తున్నాయి.

Advertisement

Read Also : Viral video: అమ్మాయి వేస్కున్న బంగారమే కాదండోయ్.. ఆమె డ్యాన్స్ చూసినా ఆశ్చర్యపోవాల్సిందే!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel