Anchor rashmi: యాంకర్ రష్మి గౌతమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని సంపాదించుకున్న యాంకర్ రష్మీ… అప్పుడప్పుడూ సినిమాల్లో కూడా నటిస్తోంది. కానీ జబర్దస్త్ షో వల్లే ఈమెకు మంచి పేరు వచ్చింది. లక్షలాది మంది అభిమానులు కూడా దొరికారు. ప్రస్తుత జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్ గా చేస్తూ మెప్పిస్తోంది. అంతే కాదండోయ్ ప్రతీ పండగకు చేసే స్పెషల్ ప్రోగ్రాంలో రష్మీని హైలెట్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. రష్మీ ఓ మనుసున్న మంచి మనిషని ఇప్పటికే ఎన్నోసార్లు ప్రూవ్ చేస్కుంది.
షూటింగ్ లతో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ అమ్మడు సెలవు దొరికిందంటే చాలు స్నేహితులతో చేరి సందడి చేస్తుంటుంది. హాయిగా రోజంతా గడిపి మళ్లీ పనుల్లో పడిపోతుంది. అయితే తాజాగా వీకెండ్ పార్టీలో భాగంగా తన స్నేహితలుతో కలిసి డ్రింక్ పార్టీ చేస్కుంది. బుల్లితెరపై హాయ్ అండ్ బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ స్నేహితులతో కలిసి నైట్ పార్టీ చేసుకుంది. దోస్తులంతా ఒక్కచోట చేరి ఫుల్లుగా మద్యం తాగారు. ఈ ఫొటోలను స్వయంగా ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ కు గురవుతున్నారు. మద్యం తాగుతూ సెల్ఫీలు దిగి పెట్టగా… ఈ ఫొటోలన్నీ నెట్టింట వైరల్ గా మారాయి. ఆదివారం రోజు రాత్రి రష్మీ తన స్నేహితులను కలిసినట్లు తెలుస్తోంది. నైట్ మొత్తం అంతా జాలీగా గడిపారు.