Lasya Pregnancy: రెండోసారి తల్లికాబోతున్న యాంకర్ లాస్య..!

Anchor lasya shares a good news to her fans
Anchor lasya shares a good news to her fans

Lasya Pregnancy: టాలీవుడ్ స్టార్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా టీవీలో వచ్చే ఓ షోలో ఈమె యాంకర్ రవితో పాటు సందడి చేసేది. ఆ తర్వాత ఢీ వంటి షోలలో కూడా పాల్గొంది. ఇప్పుడు ఆమె హవా కాస్త తగ్గింది. అయితే బిగ్ బాస్ సీజన్ 4 లో ఎంట్రీ ఇచ్చి మ్లీ వరుస షోలతో బిజీగా మారుతుంది. ఆమె క్యూట్ గా చెప్పే చీమ, ఏనుగు జోకులు అంటే చాలా మందికి ఇష్టం.

Advertisement

కేవలం లాస్య చలాకీ తనం వల్లనే ఆ జోక్స్ గా అంతగా పేలాయి. వాటి వల్లే లాస్యలో ఉన్న క్రేజీ నెస్ కాస్త బయట పడింది. ఇక లాస్య ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానెల్ ను కూడా డెవలప్ చేస్కుంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకుంటుంది. మొన్నటికి మొన్న లాస్య హాస్పిటల్ బెడ్ పై దిగిన ఫొటో ఎంతో వైరల్ అయింది. చాలా మంది ఆమె ప్రెగ్నెంట్ అయ్యుండొచ్చని ఊహించారు.

అయితే ఈ ఊహే నిజం అయింది. కాస్త లేటుగా స్పందించినా యాంకర్ లాస్య, ఆమె భర్త మంజునాథ్ లు తాము మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఐ యాం ప్రెగ్నెంట్ అగైన్. బేబీ ఇన్ ప్రోగ్రెస్.. మా ఫ్యామిలీ మరో రెండు ఫీట్లు పెరగనుంది అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement