...

Viral news: ఎండ కాస్తుందా.. వాన పడుతుందా.. ఈ కొబ్బరికాయ చెప్పేస్తుంది!

Viral news: మహీంద్ర అండ్ మహీంద్ర ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. చాలా అంశాలపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తుంటారు. తన దైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. టెక్నాలజీలో సామాన్య వ్యక్తులు చేసే ఆవిష్కరణలను కూడా ఆయన ప్రశంసిస్తూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన ఓ పోస్టు నవ్వులు పూయిస్తోంది.

మన భారత వాతావరణ శాఖ ఎంత సమర్థవంతంగా పని చేస్తుందో అందరికీ తెలిసిందే. వాన పడుతుంది అని వారు చెప్పారంటే ఆరోజు హాయిగా బయట తిరగొచ్చు. ఎందుకంటే ఆ రోజు అసలు వర్షమే పడదు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి బయట తిరగొద్దు అని చెప్పారంటే.. ఆ రోజు చల్లగా మేఘావృతమై ఉంటుంది. ఇలా చాలా సందర్భాల్లో జరిగింది.

 anand mahindra news
anand mahindra news

వాతావరణ రిపోర్టుకు సంబంధించి ఆనంద్ మహీంద్ర ఒక పోస్టు చేశారు. వాతావరణాన్ని అంచనా వేసే ఏకైక విధానం కొబ్బరికాయ అంటూ పోస్టు పెట్టారు. వెదర్ స్టేషన్ టైటిల్ ఉన్న బోర్డుకు ఒక కొబ్బరికాయ వేలాడుతోంది. కొబ్బరికాయ పొజిషన్ ను బట్టి బోర్డులో వాతావరణ పరిస్థితుల పట్టీని రాశారు. కొబ్బరికాయ కదులుతూ ఉంటే… గాలి జోరుగా ఉందని అర్థం. కొబ్బరికాయ కదలకుండా ఉంటే.. వాతావరణం ప్రశాంతంగా ఉందని అర్థం. కొబ్బరికాయ తడిసి ఉంటే.. వర్షం పడుతోందని, కొబ్బరికాయ తెల్లగా ఉంటే మంచు కురుస్తోందన్నమాట. అలాగే కొబ్బరికాయ కనిపించకపోతే.. పొగ మంచు ఉందని అర్థం. కొబ్బరికాయ లేకపోతే.. అక్కడ హరికేన్ ఉందని అర్థం వచ్చేలా రాశారు.