Poorna : హీరోయిన్ పూర్ణ అంటే తెలియని వారంటూ ఉండరు. తెలుగు ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయి అనేక సినిమాల్లో నటించింది. కొద్ది సినిమాలకే పరిమితం అయినప్పటికీ తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది. అవును అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇక తర్వాత సీమటపాకాయ్ వంటి సినిమాతో అల్లరి నరేష్ తో నటించి అందరినీ మెప్పించింది. ఇక ఈ మధ్య బాలకృష్ణ నటించిన అఖండ మూవీలో ఒక కీలకమైన పాత్రను పోషించి అందరినీ తన నటనతో మెప్పించింది. ఇక అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరకు కూడా పరిచయమైంది.

Actress poorna cancelled her marriage after engagement, What is the Reason Shamna Kasim decision
ఈవెంట్స్ లో జడ్జిగా పాల్గొంటూ ఫేమస్ అయిపోయింది. ఢీ షో కి జడ్జిగా వ్యవహరించి తనకంటూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ నీ పెంచుకుంది. ఈమె వెండితెర కన్నా బుల్లితెర మీద ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నది అని చెప్పవచ్చు. తన కెరీర్ను సాగుతున్న తరుణంలోనే తన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ ఘనంగా జరుపుకుంది. దుబాయ్ కి చెందిన బిజినెస్ మాన్ షానిధి అసిఫ్ అలీ నీ తన కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. అలాగే తన ఎంగేజ్మెంట్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
ఆ ఫోటోలు చూసిన చాలా మంది తన అభిమానులు ఆల్ ది బెస్ట్ అంటూ పోస్ట్ చేశారు. కానీ ఇంతలోనే ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఒక డైరెక్టర్ తో ఎఫైర్ వల్ల పూర్ణ తన పెళ్లి క్యాన్సిల్ చేసుకుందని సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తుంది. ఎన్నో కోట్లకు అధిపతి అయిన అసిఫ్ తో పూర్ణ తన రిలేషన్ ని కట్ చేసుకుందని ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పూర్ణ కాబోయే భర్త పెళ్ళి తర్వాత కూడా సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ తను పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక తన పెళ్లి రద్దు చేసుకోవడానికి గల కారణం ఇంతకుముందు తను డైరెక్టర్ తో నడిపిన వ్యవహారమే అని అతనిని పెళ్లి చేసుకోవాలనుకుంటుదని అందుకే ఆసిఫ్ తో జరిగిన ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకుంది అని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక దీనిలో ఎంత వాస్తవం ఉంది అనేది ఎవరికీ తెలీదు. దీనికి సమాధానం పూర్ణ నే చెప్పాలి. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Read Also : Actress Poorna : కుర్రకారుకు పిచ్చెక్కించేలా ఒంపుసొంపులన్నీ చూపిస్తూ పూర్ణ డ్యాన్స్..!