Actress Poorna: నటి పూర్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే ఆమె తనకు పెళ్లి కుదిరినట్లు అధికారికంగా ప్రకటించింది. యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పూర్ణ పెళ్లి చేస్కోబోతుంది. అసిఫ్ అలీ జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సీఈఓ, ఫౌండర్ అన్న సంగతి తెలిసిందే. జమా అల్ మెహరి అనే సంస్థను కూడా స్థాపించి కొత్త ఆఫీసులు ప్రారంభించారు. అంతేకాకుండా సెలబ్రిటీలకు యూఏఈ వీసాలను కూడా ఏర్పాటు చేస్తుంటాడు. వీసా ప్రాసెసింగ్ అలాగే ఫ్లైట్ టికెటింగ్ వంటి పలు సర్వీసులను కూడా షానిద్ కంపెనీ ఏర్పాటు చేస్తుంటుంది. అయితే పూర్ణ కుటుంబంతో ఈయనకు ముందు నుంచి పరిచయం ఉండటంతో పూర్ణకు ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈ మధ్యే వీరిద్దరి నిశ్చితార్థం కేరళలో జిరిగినట్లు ప్రచారం జరిగింది.
అయితే వీరిద్దరి పెళ్లి క్యాన్సిల్ అయినట్లు పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. వీరి మధ్య మనస్పర్థలు రావడం అలాగే ఓ టాలీవుడ్ దర్శకుడితో పూర్ణ ప్రేమలో ఉండడమే ఇందుకు కారణం అంటూ ప్రచారం సాగింది. తాజాగా ఈ వార్తలపై పూర్ణ ఒక పోస్ట్ తో క్లారిటీ ఇచ్చింది. షానిద్ అసిఫ్ అలీతో క్లోజ్ గా ఉన్న ఒక ఫటొని షేర్ చేసి ఫరెవర్ మైన్ అని పోస్ట్ పెట్టింది. అంటే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలన్నీ అబద్ధం అని ఈ పోస్ట్ నిరూపిస్తోంది. ఇక పూర్ణ నిశ్చితార్థానికి చెందిన కొన్ని ఫొటోలు కూడా మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం.