Kamya punjabi : పానీపూరి పేరు వింటే చాలు అమ్మాయిలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఎంత పెద్ద పార్టీ ఇస్తామన్నా అంత ఆసక్తి చూపించని అమ్మాయిలు పానీ పూరి అంటే ఎగబడి వస్తుంటారు. పానీ పూరి తింటుంటూ ఈ లోకాన్నే మర్చిపోతుంటారు. అందుకు మనం చూడబోయే వార్తే నిదర్శనం. ఓ హీరోయిన్ పానీపూరి తింటూ ఆ మైకంలో లక్ష రూపాయలు ఉన్నకవర్ ను షాపులోనే మర్చిపోయింది. ఇంతరు ఆ హీరోయిన్ ఎవరు, ఆ తర్వాత ఏమైందనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Kamya punjabi
కోయి మిల్ గయా, కహో నా ప్యార్ హై వంటి సూపర్ హిట్ చిత్రాల్లో యాక్ట్ చేసిన నటి కామ్యా పంజాబీ.. పానీ పూరి తింటూ లక్ష రూపాయల నగదు మర్చిపోయింది. ఇటీవల ఇండోర్ కు వెళ్లిన ఆమె అక్కడ పానీపూరి చూసి మనసు పారేసుకుంది. ఓ షాపులోకి వెళ్లి కూర్చొని పానీపూరి ఆర్డర్ ఇచ్చింది. అవి తీస్కురాగానే లక్ష రూపాయల నగదు ఉన్న కవర్ ను టేబుల్ పై పెట్టింది. పానీపూరి మంచి రుచిగా ఉండటంతో ఫుల్ గా తీనేసింది. ఆ మైకంలో అక్కడే ఫొటోలు తీస్తూ… ఆ కవర్ ను మర్చిపోయి హోటర్ రూమ్ కు వెళ్లిపోయింది.
హోటల్ కు తన చేతిలో కవర్ లేకపోయేసరికి ఖంగుతిని… వెంటనే మేనేజర్ కు సమాచారం ఇచ్చింది. తాము పానీ పూరి తిన్న షాపు అడ్రస్ చెప్పి.. అక్కడికి వెళ్లి కవర్ తీసుకురావాలని వివరించింది. వెంటనే మేనేజర్ ఆ షాపు వద్దకు వెళ్లి ఓనర్ తో మాట్లాడి నగదు ఉన్న ఎన్వలప్ కవర్ ను తీసుకువచ్చినట్లు కామ్యా పంజాబీ తెిపింది. ఈ విషయాన్ని అంతా ఆమె సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది.
Read Also : Gangavva : గంగవ్వ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. స్టార్ అయిపోయింది పో!