...

Surekha Vani : అందంతోనే కాకుండా పాటతో కూడా పిచ్చెక్కిస్తున్న సురేఖ వాణి..!

Surekha Vani : సురేఖ వాణి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తల్లి, అక్క, చెల్లి, వదిన పాత్రలలో నటించి ఒక ఇంట్లో మనిషి లాగా కలిసిపోయిన సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మధ్యకాలంలో అడపా దడపా సినిమాలలో నటిస్తున్న సురేఖ వాణి సోషియల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ప్రతీ రోజు అందమైన ఫోటోలు, వీడియోలూ సోషియల్ మీడియాలో షేర్ చేస్తు తన పాపులారిటీ మరింత పెంచుకుంటుంది.

Surekha Vani
Surekha Vani

సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తల్లీకూతుళ్లు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. డాన్సులు చేస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తున్నారు. సోషల్ మీడియాలో తల్లి కూతురు ఇద్దరు అందాల విందుతో తమ ఫాలోయర్స్ ని పెంచుకుంటున్నారు. ఇటీవల తల్లి కూతుర్లు స్విమ్మింగ్ పూల్ లో సందడి చేశారు. వీరు సోషియల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, వీడియోలు చూసిన నెటిజన్స్ వీరిని తెగ ట్రోల్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా సురేఖ వాణి తన అందాలతో పాటు, తన పాటతో కూడా నేటిజన్స్ ని మాయ చేసింది. ఈ వీడియోలో సురేఖ వాణి సరైనోడు సినిమాలోని తెలుసా తెలుసా అనే పాట కి లిప్ మూమెంట్ ఇస్తు.. ఉయ్యాల ఊగుతూ.. తన క్యూట్ అందాలతో కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. ఈ వయసులో మీకు ఈ పాట అవసరమా అని కామెంట్ చేయగా.., మీ కూతురూ పెళ్ళి అయ్యేదాకా ఇలాంటివి కొంచం తగ్గించుకోండి అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశాడు.

Read Also :Surekha vani : కూతురును చూసేందుకు వచ్చి.. నీకు ఓకే చెప్తే ఎలా సురేఖ!