...

Sri Reddy: శ్రీ రెడ్డీ కలిపిన పులిహోర చూసి సొల్లు కారుస్తున్న నెటిజన్లు..!

Sri Reddy : శ్రీ రెడ్డీ… ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో నటించాలని ఇండస్ట్రీకి వచ్చిన శ్రీరెడ్డి కెరీర్ ప్రారంభంలో అడపాదడపా సినిమాల్లో నటించింది. అయినప్పటికీ చెప్పుకోదగ్గ గుర్తింపు లభించలేదు. ఆ సమయంలో అర్థ నగ్న ప్రదర్శనతో శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమానికి తెర లేపింది. ప్రముఖ నిర్మత కొడుకు వల్ల తనకి జరిగిన అన్యాయం గురించి చెప్పి రచ్చ చేసింది. చాలా మంది దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తామని చెప్పి తనను వాడుకొని అన్యాయం చేశారు అంటూ ఆరోపణలు చేసింది. ఆ సమయంలో చాలామంది మహిళలు ఆమెకు మద్దతు ఇవ్వడంతో ఈ ఉద్యమం కాస్త రెట్టింపు అయ్యింది. ఇలా పాపులర్ అయిన శ్రీ రెడ్డీ అప్పటి నుండి ఇండస్ట్రీకి దూరంగా ఉంది.

netizens-are-fida-to-sri-reddy-pulihora
netizens-are-fida-to-sri-reddy-pulihora

అప్పటి నుండి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీ రెడ్డీ కొంత కాలం తన అందాలతో కుర్రాళ్ళకి చెమటలు పట్టించింది. తన ఫోటోలతో, వీడియోలలో సోషియల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేసేది. కానీ ఆమె ప్రస్తుతం రూటు మార్చినట్టు ఉంది. అందాల ఆరబోతకు బదులు కమ్మని రుచులతో వంటలు తయారు చేస్తూ సందడి చేస్తోంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రకృతిలో పొలాల మధ్య వివిధ రకాల వెజ్ ఆ నాన్ వెజ్ వంటకాలు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

వంటలు చేసేటప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులతో, ఎద అందాలు చూపిస్తు కమ్మనైన వంటలు వందుతోంది. ఇటీవల ఈలి పీతల పులుసు చేస్తూ సందడి చేసింది. ఆ సమయంలో ఈ పీతల పులుసు రుచి చేస్తే బెడ్ రూంలో నుంచి ఎవరు బయటకు రాలేరంటూ డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పింది. ఇలా తన వంటలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న శ్రీ రెడ్డి తాజాగా ఆంధ్రా స్టైల్లో పులిహార కలిపింది. ఈ వీడియోలో శ్రీరెడ్డి పులిహోర తయారు చేసే విధానం గురించి వివరించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పులిహోర సూపర్ అంటూ.. ఆమె కలిపిన పులిహోర కి సొల్లు కారుస్తున్నారు.

Read Also : Srireddy : పీతల కూర చేసిన హాట్ స్టార్.. శ్రీరెడ్డి వంటకం మాములుగా ఉండదు.. వీడియో చూశారా?