Sitara : సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమార్తె సితారా రచ్చ మామూలుగా ఉండదు. చిన్నప్పటి నుంచి సితారా చేసే అల్లరి ఇంతా అంతా కాదు. తన అల్లరితో తెగ సందడి చేస్తుంది సితార. సోషల్ మీడియాలోనూ సితార రచ్చ చేస్తూ ఉంటుంది. ఆ మధ్య సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి వాటిని యూట్యూబ్ లో పెట్టేది సితార. వీటికి చాలా మంది ఫ్యాన్స్ ఉండే వారు. తర్వాత ఆ షోకు ముగింపు పలికిన సితార. తర్వాత సోషల్ మీడియాలో తన వీడియోలు, పిక్స్ తో సందడి చేస్తోంది. సితార మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో సితార ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
ఈ మధ్యే మహేశ్ సినిమా సర్కారు వారి పాట సినిమాలోని ఓ పాటకు తనదైన స్టెప్పులతో అలరించింది. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేశ్ ఫ్యామిలీ ఫారిన్ ట్రిప్ కు వెళ్లింది. యూరప్ ట్రిప్ చేస్తూ అక్కడి అందమైన ప్రదేశాల్లో చక్కర్లు కొడుతున్నారు మహేశ్ ఫ్యామిలీ మెంబర్స్. సోదరుడితో కలిసి అల్లరి చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది సితార. వాటికి సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటి కప్పుడు చేర వేస్తూ ఉంటుంది.
సమంత అంటే తనకు చాలా ఇష్టమని చెబుతూ ఉంటుంది సితార. సమంతతో ప్రతి క్షణం గడపాలని కోరుకుంటానని చెప్పింది. తన తండ్రి మహేశ్ బాబుతో కలిసి నటించినప్పుడు సెట్స్ లో సమంతతో సరదాగా గడిపానని చెప్పింది సితార.
Read Also : Sitara Dance : సితార డ్యాన్స్ చూశారా? సినిమాల్లో ఎంట్రీ ఎప్పుడంటే.. వీడియో!