Crocodile Bark Trees : మనిషి బతకాలంటే కచ్చితంగా చెట్లు కావాల్సిందే. ఎందుకంటే మనకు ఆక్సిజన్ ని ఇచ్చే ఆ చెట్లు లేకపోతే మనం బతకలేం. అయితే వాటికి కూడా ప్రాణం ఉందని మన శాస్త్రవేత్తలు నిరూపించిన విషయం మనకు తెలిసిందే. అయితే మనకు చాలా చెట్లు తెలుసు. పండ్లు, ఆకులు, పూలను, ఆక్సిజన్ ను మాత్రమే ఇచ్చే చెట్ల గురించి అందరకీ తెలుసు. కానీ స్వచ్ఛమైన నీటిని ఇచ్చే చెట్ల గురించి మాత్రం చాలా మందికి తెలియదు. అయితే ఆ చెట్లు ఏంటో వాటి కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మొసలి బెరడు చెట్టు.. దీని సైంటిఫిక్ నేమ్ టెర్మినాలియా టొమెంటోసా. ఈ చెట్టు నుంచి మంచి నీరు ప్రవాహంలా వస్తుంది. దాహం వేసిన వాళ్లు దాహార్తిని కూడా తీర్చుకోవచ్చు. దీని సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ చెట్లు దక్షిణ భారత్‌లో అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి నీరు అంతగా లేని ప్రాంతంలో కనిపిస్తాయి. ఎండాకాలంలో తమకు కావాల్సిన నీటిని ఇవి తమ కాండాల్లో దాచుకుంటాయి.
అందువల్ల అడవుల్లో ఎవరికైనా దాహం వేస్తే ఈ చెట్టు కాండాన్ని కొద్దిగా తొలగిస్తే చాలు కుళాయి నుంచి నీరు వచ్చినట్లుగా బయటకు నీరు తన్నుకుంటూ వస్తుంది. ఆ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. సహజంగా అడవుల్లో తిరిగే ఫారెస్ట్ ఆఫీసర్లు, పల్లె ప్రజలు దాహం వేసినప్పుడు ఈ చెట్ల నుంచి నీటిని తాగుతారు. దీని బెరడు… మొసలి చర్మం రంగులో, ఆకారంలో ఉండటం వల్ల దీన్ని మొసలి బెరడు చెట్టు అని పిలుస్తున్నారు.
Read Also : Corona Vaccine : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!