Guppedantha Manasu: జగతి,మహేంద్రలను ఉండిపొమ్మని చెప్పిన రిషి.. షాక్ లో దేవయాని..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇది ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మినిస్టర్ గారిని సన్మానం చేయడం కోసం రిషి, ఇంటిని అందంగా డిజైన్ చేస్తారు.

ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా వసుధార బర్త్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఇంట్లో డెకరేషన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో బర్త్ డే లో డి అనే లెటర్ పడి పోతూ ఉండగా ఇంతలో రిషి వచ్చి దానిని పట్టుకొని ఎప్పటికీ పడిపోనివ్వను వసు అని అంటాడు. మరొకవైపు మహేంద్ర, జగతి లో కార్ లో వస్తూ ఉంటారు.

Advertisement

ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని మహేంద్ర సంబరపడుతూ ఉంటాడు. మరొకవైపు దేవయాని, రిషి అందరూ మినిస్టర్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో జగతి,మహేంద్ర వస్తారు. అప్పుడు అందరూ వెళ్లి మహేంద్ర కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతారు.

కానీ దేవయాని మాత్రం కుళ్ళు కుంటూ ఉంటుంది. అప్పుడు దేవయాని మినిస్టర్ గారు వస్తున్నారు అని నువ్వు ఇక్కడికి వచ్చావు ఇక్కడే ఉండి పోవడానికి రాలేదు సంబరపడి పోకు అని అనడంతో.. అక్కయ్య గారు నాకు గానే ఆలోచనలు అన్నీ నీకు ఎందుకు వస్తున్నాయి.. చూస్తే నాకు నవ్వు వస్తోంది అని అనడంతో దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

ఇంతలో అక్కడికి మినిస్టర్ రావడంతో ఫ్యామిలీ మొత్తం మినిస్టర్ ని గౌరవంగా ఆహ్వానిస్తారు. ఆ తర్వాత మినిస్టర్ కి సన్మానం చేసి అందరు కలిసి భోజనం చేస్తారు. భోజనం తర్వాత మినిస్టర్ గారు వెళ్ళిపోతారు. ఆతరువాత దేవయాని వెళ్లాల్సిన వారు కూడా వెళితే మనం ఇంట్లో కి వెళ్దాం అని అనడంతో అప్పుడు రిషి అప్పుడేనా పెద్దమ్మ నేను ఇంకా నాన్నకు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వలేదు కదా అని అంటాడు.

Advertisement

ఆ తర్వాత రిషి ఎమోషనల్ అవుతూ తన తండ్రి గురించి పెద్దమ్మ గురించి గొప్పగా చెబుతాడు. ఆ తర్వాత మీ ఆనందం నాకు కావాలి మీరు, మీ మనసు కోరుకున్న వ్యక్తి కూడా ఇక్కడే ఉండండి అని అనగా అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు రిషి మీ భార్యతో ఇక్కడే కలిసి ఉండండి డాడ్ అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. దేవయాని మాత్రం లోలోపల కుమిలిపోతూ కులుకుంటూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel