Guppedantha Manasu: వసుధార కోసం కాలేజీలో సెలబ్రేషన్స్ చేస్తున్న రిషి.. కోపంతో రగిలిపోతున్న దేవయాని..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసుధార, రిషి హత్తుకుంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార కిచెన్ లో వంట చేస్తూ ఉండగా ఇంతలో గౌతమ్ అక్కడికి వెళ్లి ఈ పనులను నీకెందుకు వసుధార అని అంటాడు. అప్పుడు ఏం కాదు సార్ మన అనుకున్న వారికోసం ఇలా చేస్తే తప్పేమీ లేదు అని అంటుంది వసు. ఆ తరువాత గౌతమ్ యూనివర్సిటీ టాపర్ అయ్యావు కదా నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడగగా ఇంకా చాలా ఉన్నాయి సార్ అనడంతో నేను అడిగేది నీ చదువు గురించి కాదు వసుధార రిషితో నీ ఫీచర్ గురించి మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ ఒక్క అడ్డుతెర తొలగినట్లేనా అని అడుగుతాడు గౌతమ్.

Advertisement

అప్పుడు వసుధార సర్ మీరు రిషి సార్ జగతి మేడంని అమ్మ అని పిలవడం గురించి మాట్లాడుతున్నారా సార్ అని అడుగుతోంది. అవును వసుధార ఇప్పుడు ఎలాగో మహేంద్ర అంకుల్ వాళ్లు కూడా ఇక్కడ లేరు కదా మరి ఆ విషయంలో నీ ఆలోచన ఏమైనా మారిందా అని అడుగుతాడు గౌతమ్. అప్పుడు రిషి సార్ జగతి మేడంని అమ్మ అని పిలవడం కాదు. అమ్మ అని ప్రేమగా పిలవాలి అలాగే రిషి సార్ కోల్పోయిన అమ్మతనం కూడా తిరిగి రావాలి అని అంటుంది వసుధార. అప్పుడు గౌతమ్ నువ్వు ఆ ఒప్పందం నుంచి డ్రాప్ అయినట్లేనా వసుధర రిషికి నీకు మధ్య ఆ అడ్డుతెర తొలగినట్టేనా అనడంతో గౌతమ్ కి అర్థం కాని విధంగా మాట్లాడుతుంది.

నేను దారి మార్చుకున్నాను సార్ గమ్యం మార్చుకోలేదు అని అంటుంది. అప్పుడు నేను నా గమ్యాన్ని మార్చుకున్నాను రిషి సార్ ని నేను ఇబ్బంది పెట్ట దలుచుకోలేదు అనడంతో గౌతమ్ ఊపిరి పిలుచుకుంటాడు. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. అప్పుడు రిషి అక్కడికి వచ్చి వసుధార నువ్వు యూనివర్సిటీ టాపర్ అయినందుకు నీకోసం కాలేజీలో సెలబ్రేషన్స్ చేస్తున్నారు అని అంటాడు. కానీ వసుధార మాత్రం నేను అందుకు సిద్ధంగా లేను సార్ అని అంటుంది.

అప్పుడు గౌతమ్, రిషి,వసుధార మాట్లాడుతున్న మాటలు విన్న దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి వసుధర ఏం ఆలోచిస్తుంది ఇప్పుడు ఏం ప్లాన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని. వసుధార మాటలు నాకేం అర్థం కాలేదు అని అనుకుంటూ ఉంటుంది. రిషి ని ఎలా అయినా నా ఆధీనంలోకి తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. ఇక మరుసటి రోజు ఉదయం ధరణి వంట చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి దేవయాని వస్తుంది.

Advertisement

ఏంటి ఈవిడ ఇలా వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ధరణి. అప్పుడు దేవయాని అక్కడికి వెళ్లి ఏంటి ధరణి ఏంటి విశేషాలు అని అడుగుతుంది. అప్పుడు ధరణి ఏమీ లేదు అత్తయ్య అని అంటుంది. అప్పుడు ఈరోజు వసుధార రిషి ఇంకా నిద్ర లేవలేదు ఆ వసుధర రిషికి సంబంధించిన పనులు అన్ని చూసుకుంటుంది. కాబట్టి ఆ వసుధార ఇంకా లేవలేదు దీనినే మనం ఆయుధంగా మార్చుకోవాలి ధరణి అని అంటుంది. అప్పుడు దేవయాని, రిషి కోసం కాఫీ తీసుకొని వెళుతుంది. మరొకవైపు వసుధార, రిషి సార్ రూమ్ సర్దుతూ ఉంటుంది.

అప్పుడు వసుధార ఇచ్చిన నెమలి ఈకలు గోలీలు, వి ఆర్ అనే ఉంగరం చూసి మురిసిపోతూ ఉండగా ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. అప్పుడు ఏం చేస్తున్నావు అని అనడంతో రూమ్ సర్దుతున్నాను సార్ అని అంటుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందమైన జ్ఞాపకాలు కదా సార్ ఇవి అని అంటుంది వసుధార. అప్పుడు వసుధార ఆ ఉంగరం చూస్తూ ఉంగరం తో మాట్లాడుతూ ఉండగా వెంటనే రిషి హలో గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళని పక్కనపెట్టి గిఫ్ట్ ని చూస్తున్నావు అని అనగా నాకు ఇందులో మీరే కనిపిస్తున్నారు సర్ అని అంటుంది.

అప్పుడు వారిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవయాని కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడు దేవయాని వసుధార చేతిలో ఉన్న గిఫ్ట్ చూసి ఏంటది అనుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు రిషి కి కాఫీ ఇవ్వగా ఏంటి పెద్దమ్మ మీరు తీసుకువచ్చారు అనడంతో నీకన్నా నాకు ఎవరు ముఖ్యం కాదు నాన్న అంటూ దొంగ ప్రేమ చూపిస్తూ ఉంటుంది దేవయాని. అప్పుడు దేవయాని నువ్వు ఈ కాఫీ తాగేసి నిన్ను వసుధార కోసం ఇంకొక కాఫీ తెప్పిస్తాను అని అనగా మేడం మళ్ళీ నా కోసం కాఫీ ఎందుకులే ఇద్దరు షేర్ చేసుకుంటాము అని అంటుంది వసుధార.

Advertisement

దాంతో దేవయాని వసుధార వైపు కోపంగా చూస్తూ తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు వసుధర రిషి ఇద్దరు ఒకే కప్పులో కాఫీ తాగుతూ ఉండడం చూసి ఈ దేవయాని కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రిషికి ఫణింద్ర ఫోన్ చేస్తాడు. అప్పుడు రిషి పెద్దమ్మ పెదనాన్న ఇంటికి వచ్చాక డాడీ గురించి అడిగితే ఏం చేద్దాం అని అడుగుతాడు. దేవయాని కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత రిషి వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో దేవయ్య అని ఈ మహేంద్ర వాళ్ళు వెళ్ళడమేమో కానీ నాకు టెన్షన్ టెన్షన్ గా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. బయటికి వెళ్లిన రిషి ఆలోచిస్తూ ఉంటాడు.

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel