Intinti Gruhalakshmi: లాస్య,భాగ్య మాస్టర్ ప్లాన్.. ఇంటిని అమ్మేసిన తులసి..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. నిన్నటి ఎపిసోడ్ లో శశికళ రెండు రోజులు సమయం ఇచ్చి రెండు రోజుల్లో తన అప్పు తీర్చకపోతే ఇళ్ళు తన పేరు మీద రాయించుకుంటాను అని చెప్పి వార్ణింగ్ ఇచ్చి వెళుతుంది..

లాస్య భాగ్య కి కాల్ చేసి ఈ విషయంలో ఏ మాత్రం తగ్గద్దు, తులసి అమాయకపు మాటలు లొంగవద్దు అంటూ భాగ్య ను మరింత రెచ్చగొడుతుంది. లాస్య మాటలకు భాగ్య మరింత రెచ్చిపోతూ ఇంట్లో నా వాటా నాకు వచ్చే వరకూ ఇంట్లో నుంచి కదిలేదే లేదు, ఇంకా ఎక్కువ చేస్తే నేను కోర్ట్ కి వెళ్తాను అంటూ రెచ్చిపోయి మాట్లాడుతుంది భాగ్య.

Advertisement

అప్పుడు లాస్య ఇంకా చెప్పాలి అంటే ఆ ఇంట్లో పెద్ద కోడలిగా వాటా తీసుకునే హక్కు నాకు కూడా ఉంది అని అంటుంది. అలా వారిద్దరూ కలిసి తులసిపై మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఎలా అయినా తులసిని రోడ్డుకి ఈడ్చాలి అని ప్లాన్ లు వేస్తూ ఉంటారు. మరొక వైపు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన నందు ఆకలి అవుతుంది అని భోజనం చేయడానికి సిద్ధంగా లాస్య భోజనం చేసి ఉండదు.

కోపంతో నందు లాస్య భోజనం ఎందుకు ప్రిపేర్ చేయలేదు అని అడగగా నాకు మూడు బాగా లేదు అని చెబుతుంది. ఆన్లైన్లోనే ఆర్డర్ చేసి చూపించవచ్చు కదా అని అనగా.. డబ్బులు వేస్ట్ అంటావని ఆర్డర్ చేయలేదు నందు అంటూ వెటకారం గా మాట్లాడుతుంది లాస్య. మరొకవైపు శృతి, ప్రేమ్ ని నిద్రలేపి ఉద్యోగం కోసం వెళ్ళమని చెబుతుంది.

ప్రేమ్ నీ లక్ష్యం సాధించేవరకు ఎన్ని అడ్డంకులు అయినా ఎదుర్కోవాల్సిందే అంటూ ప్రేమ్ కు ధైర్యం చెబుతుంది శృతి. మరొకవైపు లాస్య తులసికి ఫోన్ చేసి నేను ఎక్కుపెట్టిన బాణం భాగ్య చివరికి విజయం అంటూ విర్రవీగుతూ ఉంటుంది.. అప్పుడు తులసీ తన మాటలతో లాస్య బుద్ధి చెబుతుంది.

Advertisement

ఇక మరుసటి రోజు ఉదయం భాగ్య తన భర్త కు ఫోన్ చేసి అంతా వివరించి నువ్వు రెడీగా ఉండు కోర్టుకు వెళ్దాం అని రెచ్చ గొడుతూ ఉంటుంది. అప్పుడు తులసీ నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ భాగ్య వినదు. ఇంతలో శశికళ రావడంతో తన ఇంటిని శశికళ పేరు పై రాసిస్తుంది తులసి. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel