Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో రిషి ఇంటికి వసు రావడంతో వసు ని ఆటపట్టిస్తాడు రిషి.
వసు ఉదయాన్నే రిషి ఇంటికి వెళుతుంది. ఇక వసుకి గుమ్మంలోనే దేవయాని ఎదురై ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ వసు ని అవమానించే విధంగా మాట్లాడుతుంది దేవయాని. దీనితో వసు తెలివిగా సమాధానం చెబుతుంది. రిషి ఇంట్లో లేనప్పుడు నీకు ఇంట్లో ఏం పని అని దేవయాని అడగగా.. అప్పుడు వసు మహేంద్ర సార్ పంపించారు.

మహేంద్ర సార్ కి సంబంధించిన బుక్స్, వస్తువుల కోసం వచ్చాను అని ధరణి చెబుతుంది. అప్పుడు ధరణి మనసులో నీకు ఇలాంటి కోడలు పిల్ల వస్తే బాగుంటుంది అని అనుకుంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక ఎలా అయినా సరే రిషి సార్ తో మహీంద్రా సార్ ని ఇక్కడికి తీసుకు రమ్మని చెప్పండి అని చెబుతుంది వసు.
ఆ తర్వాత రిషి రూము లోకి వెళుతుంది. అక్కడ తాను ఇచ్చిన వస్తువులను చూసి ఆనందంతో మురిసిపోతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి వసు ని చూసి ఆశ్చర్య పోతాడు. ఆ తరువాత వసు ని ఆట పట్టించినట్టుగా మాట్లాడటంతో, అప్పడు వసు సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్లిపోతుంది.
అప్పుడు రిషి తన టేబుల్ ఫై ఉన్న వస్తువులన్నీ చూసిందా అని అవి సర్ది పెట్టే ప్రయత్నం చేస్తుండగా వసు తొంగి చూసి ఆనందంతో మురిసి పోతూ ఉంటుంది. మరోవైపు దేవయాని ధరణి నానా మాటలతో హింసిస్తూ ఉంటుంది. అప్పుడు ఫణీంద్ర ఎప్పుడు ధరణి ని ఏదో ఒకటి అనకపోతే నీకు దిక్కుతోచదా అని అంటాడు.
అప్పుడు ధరణి మనసులో ఇకపై మీ ఆటలు సాగవు అత్తయ్య గారు రిషి కూడా మిమ్మల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు అని అనుకుంటుంది. ఒకవైపు జగతి, మహేంద్ర కారులో వెళ్తూ ఉండగా అప్పుడు జగతి మహేంద్ర పుట్టిన రోజు, ఇంతకు ముందు జరిగిన పుట్టిన రోజులకు తాను లేనందుకు బాధపడుతూ ఉంటుంది జగతి. అప్పుడు మహేంద్ర మాట్లాడుతూ రిషి ప్రేమించడం మొదలు పెడితే చాలా బాగా ప్రేమిస్తాడు అని చెబుతాడు.
ఆ తరువాత రిషి నేను బర్త్ డే సెలబ్రేషన్స్ మీతో జరుపుకోవాలి అని మహేంద్ర తో అనగా, అప్పుడు మహేంద్ర నేను నా భార్యను వదిలేసి రాను, నా భార్యను వదిలేసి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాను అన్న గిల్టీ ఫీలింగ్ నాకు అవసరం లేదు అని మహేంద్ర అనడంతో ఒక్కసారిగా బాధపడతాడు. మహేంద్ర మాటలకు ఒక్కసారిగా ఎమోషనల్ అవుతాడు రిషి.
- Guppedantha Manasu june 2 Today Episode : రిషి గురించి బాధ పడుతున్న జగతి దంపతులు..వసుకి ఫోన్ చేసిన రిషి..?
- Guppedantha Manasu serial Oct 22 Today Episode : అసలు విషయం తెలుసుకుని షాక్ అయిన రిషి.. బాధలో వసుధార?
- Guppedantha Manasu Oct 26 Today Episode : రిషి మాటలకు షాక్ అయిన దేవయాని.. బాధతో కుమిలిపోతున్న జగతి మహేంద్ర..?













