Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Human zoo park: ఈ జూలో పశువులకు బదులు మనుషులనే బోనులో ఉంచుతారట.. తెలుసా?

Human zoo park: జూ పార్క్ అంటే.. జంతువులు ఉండే పార్కని మన అందరికీ తెలుసు. అయితే అక్కడ చాలా జంతువులను బోనులో ఉంచుతారు. మరికొన్నింటిని ఫ్రీగా తిరగనిస్తారు. ఈ విషయ

By Vinod Kumar

Published on: August 25, 2022 8:00 AM

Updated on: August 24, 2022 10:50 PM

---Advertisement---

Human zoo park: జూ పార్క్ అంటే.. జంతువులు ఉండే పార్కని మన అందరికీ తెలుసు. అయితే అక్కడ చాలా జంతువులను బోనులో ఉంచుతారు. మరికొన్నింటిని ఫ్రీగా తిరగనిస్తారు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ఇందులో పెద్ద వింతేమీ లేదు. కానీ మనం ఇప్పుడు చూడబోయే జూలో మాత్రం జంతువులకు బదులుగా.. మనుషులనే బోనులో ఉంచుతారు. అయితే అదెక్కడ, ఆ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Human are kept in cages at chongking zoo park 1

Advertisement

చోంగ్ కింగ్ అనే నగరంలో లేహెలెడు వైల్డ్ లైఫ్ జూలో జంతువులు స్వేచ్థగా విహరిస్తుంటే… మనుషులు మాత్రం బోనులో వెళ్లి తిలకించి వస్తుంటారు. జూ పర్యాటకులు లాక్ చేసిన బోనులోకి వెళ్తారు. ఆ క్రూర మృగాలు బోనుకు సమీపంగా వస్తుంటాయి, పులులు సింహాలు ఎలుగుబంట్లు ఆ బోను చుట్టూ తిరుగుతుంటాయి. అయితే ఆ జంతువులను బోను వైపు ఆకర్షించడానికి జూ నిర్వాహకులు సాహసోపేతమైన ఆడియాను అమల్లో పెట్టారు.

అదేంటంటే.. పచ్చి మాంసాన్ని పెద్ద ముక్కులుగా చేసి మనుషులు వెళ్లే ఆ బోనుకు బయట వైపు తగిలేస్తుంటారు. దీంతో ఆ జంతువులు బోను వైపు వస్తాయి. వాటి చుట్టే తిరుగుతుంటాయి. ఆ మాంసం తిని అక్కడే కాసేపు సేద తీరుతాయి. ఒక్కోసారి ఈ బోను ఎక్కి కూడా ఆడుకుంటాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :