Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Viral video : భరాత్‌లో వరుడి డ్యాన్స్.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నవధువు!

Viral video : ఈ మధ్య కాలంలో పెళ్లిలో వింత వింత ఘటనలు జరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే పెళ్లిళ్లు క్యాన్సల్ చేసుకోవడం, పెళ్లీ పీటల మీద నుంచి లేచి వెళ్లిపోవడం

By Vinod Kumar

Published on: April 29, 2022 12:47 PM

Updated on: January 24, 2023 7:23 AM

---Advertisement---

Viral video : ఈ మధ్య కాలంలో పెళ్లిలో వింత వింత ఘటనలు జరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే పెళ్లిళ్లు క్యాన్సల్ చేసుకోవడం, పెళ్లీ పీటల మీద నుంచి లేచి వెళ్లిపోవడం మనం తరచుగానే చూస్తున్నాం. అయితే అలాంటి ఓ వింత ఘటనే జరిగింది మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో. మల్కాపూర్ పాంగ్రా గ్రామంలో ఈనెల 22న ఒక జంట పెళ్లి కోసం అన్ని ఏఱ్పాట్లు చేసుకుంది. అయితే సాయంత్ర 4 గంటలకు పెళ్లి మహూర్తం ఉంది. ఈ క్రమంలోనే అబ్బాయి పెళ్లి మండపానికి వచ్చేటప్పుడు తీసే భారత్ లో విపరీతమైన డ్యాన్సులు చేస్తూ ఆఢిపాడాడు. తాగి ఊగుతూ.. ఫుల్ గా ఎంజాయ్ చేశాడు.

groom fail to arrive on time bride marries another man

Advertisement

ఎట్టకేలకు రాత్రి 8 గంటలకు పెళ్లి మండపానికి చేరుకున్నాడు. అప్పటి వరకూ వేచి చూసిన అమ్మాయి కుటుంబ సబ్యులు, వారి తరపు బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సమయానికి అబ్బాయి రాలేడనే కోపంతో వధువు తండ్రి వేరే అబ్బాయితో పెళ్లి జరిపించేశాడు. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :