Janaki Kalaganaledu : జానకికి రోడ్డుపైనే అవమానం.. నిజం తెలుసుకున్న జానకి అన్నయ్య..?

Updated on: April 3, 2022

Janaki Kalaganaledu March 30 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. జ్ఞానాంబ కుటుంబం మొత్తం గిఫ్ట్ లు తీసుకునే జానకి ఇంటి దగ్గరికి వెళ్లి రచ్చరచ్చ చేస్తూ ఉంటారు. అయితే అదే మంచి సమయంగా భావించిన మల్లిక జానకి పై లేనిపోని నిందలు వేస్తూ జ్ఞానాంబ ని మరింత రెచ్చ గొడుతూ ఉంటుంది. కావాలనే నువ్వు మీ అన్నయ్య తో కలిసి ప్లాన్ వేసి అత్తయ్య మనసు మార్చడానికి ప్రయత్నిస్తున్నావు అంటూ జానకి పై నిందలు వేస్తుంది మల్లిక.

అప్పుడు జానకి ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా కూడా జ్ఞానాంబ కోపంగా మాట్లాడి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత జానకి వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి అల్లుడు పుట్టాడు అని జానకి దంపతులకు గుడ్ న్యూస్ చెబుతాడు. ఆ మాట విన్న జానకి రామచంద్ర సంతోషం వ్యక్తం చేస్తారు.

Janaki Kalaganaledu March 30 Today Episode
Janaki Kalaganaledu March 30 Today Episode

అప్పుడు వారిద్దరూ బాధపడుతూ మీ అన్నయ్య అల్లుడు పుట్టాడు అన్న ఆనందంలో గిఫ్టులు పంపాడు కానీ ఇలా జరిగింది ఏంటి అని బాధపడుతూ ఉంటారు. మరొకవైపు మల్లిక జానకి అన్నయ్యకు ఫోన్ చేసి మా అత్తయ్య జానకి, రామచంద్ర లను ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది. జానకి ఎన్నో కష్టాలను అనుభవిస్తుంది అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ అక్కడ జరిగినదంతా జానకి అన్నయ్యకు వివరిస్తుంది.

Advertisement

అప్పుడు జానకి అన్నయ్య కోపంతో రగిలి పోతూ ఉంటాడు. మరొకవైపు రామచంద్ర, జానకి లు రొమాంటిక్ గా మాట్లాడుతూ మీరు మంచం పైన పడుకోవాలి అంటే లేదు మీరే పడుకోవాలి అంటూ ఇద్దరూ రొమాంటిక్ గా గొడవ పడుతూ పరుపు మొత్తం చింపేస్తారు.

మరుసటి రోజు ఉదయం జానకి రామచంద్రకు భోజనం తీసుకొని వెళుతుండగా మధ్యలో అడ్డుపడిన నీలావతి రోడ్డుపైనే, జ్ఞానాంబ స్వీట్ షాప్ ముందు జానకి అవమానిస్తూ, దెప్పి పొడిచే విధంగా మాట్లాడుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Niharika Pub Case : బంజారాహిల్స్ పబ్ కేసులో ప్రముఖులు.. నిహారికకు పోలీసుల నోటీసులు!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel