Top 10 Foods Diabetics : డయాబెటిస్ ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలపై ఫుల్ తెలుగు గైడ్..!

Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు తప్పక పాటించాలి. మీకు డయాబెటిస్ ఉంటే ఏమి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

Top 10 Foods Diabetics :  మీకు డయాబెటిస్ ఉందా? ఒకవేళ ఉంటే ఎలాంటి పదార్థాలను తినకూడదో తెలుసా? చాలామంది తమకు షుగర్ ఉందనే (Top 10 Foods Diabetics) విషయం కూడా తెలియదు. అంతేకాదు.. డయాబెటిస్ ఉన్నప్పటికీ ఏయే పదార్థాలను తినకూడదో తెలియదు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న జీవనశైలి సంబంధిత వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. శరీరంలో రక్తంలోని గ్లూకోజ్ స్థాయి నియంత్రణ లోపంతో డయాబెటిస్ వ్యాధి వస్తుంది.

డయాబెటిస్ ఉన్నవారు కేవలం మందులే కాదు.. సరైన ఆహార నియమాలు (Diabetic diet restrictions) పాటించడం ద్వారా కూడా రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవచ్చు. కొన్ని ఆహార పదార్థాలు డయాబెటిక్ బాధితుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. డయాబెటిస్ తో బాధపడే వాళ్లు ఎలాంటి పదార్థాలను తినకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

(Top 10 Foods Diabetics) డయాబెటిస్ ఉంటే తినకూడని ముఖ్యమైన ఆహార పదార్థాలివే :

1. రైఫైండ్ చక్కెర, ఇతర చక్కెర పదార్థాలు :
చక్కెర కలిసిన పానీయాలు, కాండీస్, స్వీట్స్, కేకులు, పేస్ట్రీలు, జెల్లీలు, ఐస్ క్రీమ్స్ వంటివి రక్తంలో గ్లూకోజ్‌ను ఒక్కసారిగా పెంచేస్తాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఎక్కువగా ఉండే పదార్థాలుగా చెబుతారు. GI ఎక్కువగా ఉండటం అంటే తినగానే రక్తంలో చక్కెర వేగంగా పెరిగిపోతాయి.

Advertisement

2. వైట్ బ్రెడ్, వైట్ రైస్, వైట్ పాస్తా :
ఈ ఆహార పదార్థాలు పూర్తిగా కార్బోహైడ్రేట్లతో నిండినవి. తినగానే శరీరంలో చక్కెరగా (Diabetic foods list to avoid) మారిపోతాయి. దాంతో రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది.

3. జంక్ ఫుడ్ :
పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, నూడుల్స్, పఫ్‌, బజ్జీలు, స్నాక్స్ వంటివి ట్రాన్స్‌ఫ్యాట్‌, రిఫైండ్ కార్బ్స్ అధిక సాల్ట్ కలిగి ఉంటాయి. ఎక్కువగా తినడం వల్ల కేవలం షుగర్ పెరగడమే కాకుండా బరువు పెరగడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి సమస్యలకు దారితీస్తుంది.

PM Kisan 22nd installment
PM Kisan 22nd installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. e-KYC మాత్రమే కాదు.. ఈ డాక్యుమెంట్ లేకున్నా 22వ విడత డబ్బులు రావు

4. కూల్ డ్రింక్స్, సోడా, ఎనర్జీ డ్రింక్స్ :
ఈ శీతల పానీయాలు అధిక మోతాదులో చక్కెరను కలిగి ఉంటాయి. కొన్ని బాటిల్‌లో 8 నుంచి 10 టీ స్పూన్ల చక్కెర ఉంటుంది. ఈ పానీయాలను (Sugar control diet for diabetics) తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఒక్కసారిగా తీవ్రంగా పెరిగిపోతుంది.

Advertisement

5. పాలు (ఫుల్ ఫ్యాట్ డైరీ) : (Top 10 Foods Diabetics)
తక్కువ ఫ్యాట్ ఉన్న పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగించాలి. ఫుల్ ఫ్యాట్ పాలలో ఉన్న సాచ్యురేటెడ్ ఫ్యాట్‌ శరీరంలో ఇన్సులిన్ పనితీరుపై ప్రభావం చూపించవచ్చు.

Top 10 Foods Diabetics
Top 10 Foods Diabetics

6. తీపి పండ్లు (మామిడి, జామ, అరటి) :
తీపిగా ఉండే పండ్లలో సహజంగా షుగర్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ GI ఉంటే పండ్లైన సబ్బిలు, బేరి, జామ, యాపిల్ వంటివి పరిమితంగా తినవచ్చు. కానీ, మామిడి, అరటి, శీతాఫలాలను పరిమితంగా తినాలి.

Read Also : Corriander Benefits : ధనియాలతో డయాబెటిస్‌కు చెక్.. బ్లడ్ షుగర్ లెవల్స్ ఇలా నియంత్రణ..!

Advertisement

7. తేనె, బెల్లం :
తేనె లేదా బెల్లం సహజమైనవే. ఇవి కూడా చక్కెరలానే రక్తంలో గ్లూకోజ్‌ను పెంచుతాయి. బెల్లం మంచిదని (Telugu diabetes diet tips) చాలామంది అనుకుంటారు. కానీ, డయాబెటిస్ ఉన్నవారికి అత్యంత ప్రమాదకరం.

Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

8. షుగర్, ప్యాకేజ్డ్ బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్ :
ప్యాకేజ్డ్ కార్న్ ఫ్లేక్స్, గ్రానోలా బార్స్, ఇన్స్టంట్ ఓట్స్ వంటి వాటిలో అధిక మోతాదులో చక్కెర, సోడియం ఉంటాయి. ఆరోగ్యకరమైనట్లే అనిపించవచ్చు. కానీ, నిజానికి డయాబెటిక్ ఉన్నవారికి చాలా ప్రమాదకరం..

9. ఆల్కహాల్ :
బీర్, వైన్, మిక్స్డ్ డ్రింక్స్ వంటివి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. కొన్ని మద్యాలు రక్తంలో గ్లూకోజ్‌ను ( Prediabetes food guide) తక్కువ చేస్తే.. కొన్ని పెంచుతాయి. మద్యం వల్ల నిదానంగా ఇన్సులిన్ పనిచేస్తూ హైపోగ్లైసీమియా ముప్పుకు దారితీస్తుంది.

Advertisement

10. అధిక ఉప్పు (సోడియం) :
అధిక ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో గుండె సంబంధిత సమస్యల ముప్పును పెంచుతుంది. ప్యాకేజ్డ్ ఫుడ్‌, పికిల్స్, పాపడ్లు, చట్నీ పౌడర్లలో ఎక్కువగా ఉప్పు ఉంటుంది.

(Top 10 Foods Diabetics) డయాబెటిస్ ఉంటే పాటించాల్సిన ముఖ్యమైన నియమాలివే :

  • ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తినాలి : కూరగాయలు, చిరు ధాన్యాలు, గింజలు.
  • కొద్దికొద్దిగా భోజనంతో తరచూ తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా తినకూడదు.
  • నీళ్లన బాగా తాగాలి. జ్యూస్ కన్నా నీరు చాలా మంచిది.
  • బరువు అదుపులో ఉండాలి. అధిక బరువుతో డయాబెటిస్‌ను కంట్రోల్ చేయలేరు.
  • ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.
  • రోజూ కనీసం 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయాలి.

(Top 10 Foods Diabetics) డయాబెటిస్ డైట్‌లో జాగ్రత్తలివే :

  • ఆహార పదార్థాల గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తెలుసుకోండి.
  • ప్యాకేజింగ్ లేబుల్స్ చదవడం అలవాటు చేసుకోండి (sugar, sodium, saturated fat).
  • ప్యాకేజ్డ్ ఫుడ్స్ కన్నా తాజాగా ఇంట్లో తయారు చేసిన ఫుడ్ మాత్రమే తీసుకోండి.

డయాబెటిస్‌ను సమర్థవంతంగా అదుపులో ఉంచాలంటే తినే ఆహారంపై అవగాహన తప్పనిసరి. మితంగా, బ్యాలెన్స్ డైట్, వ్యాయామం చేయడం, మెడికల్ ఫాలో-అప్ ఉండటం ద్వారా డయాబెటిస్ వల్ల వచ్చే సమస్యలను ముందే నివారించవచ్చు.

రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. మీ ఆరోగ్యమే మహాభాగ్యం.. డయాబెటిస్ ఉన్నవారు ఆహార పదార్థాలను తగ్గించటమే కాకుండా మానేయటం వల్ల జీవితాంతం ఆరోగ్యంగా జీవించవచ్చు.

Advertisement
IND vs SA 1st T20I Hardik Pandya Enters Elite T20 Club After Virat Kohli And Rohit Sharma
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

RELATED POSTS

Join our WhatsApp Channel