Business Idea : మీ జాబ్‌కు గుడ్‌బై చెప్పేయండి.. ఈ 5 బిజినెస్‌లతో కోట్లు సంపాదించుకోవచ్చు.. తక్కువ పెట్టుబడితో కోట్ల ఆదాయం..!

Business Idea : ఆన్‌లైన్ కంటెంట్ క్రియేషన్ నుంచి అగరుబత్తుల తయారీ వరకు ఈ వ్యాపారాలు తక్కువ డబ్బుతో ప్రారంభమై లక్షలు సంపాదించుకోవచ్చు.

Business Idea : భారత్‌లో తక్కువ పెట్టుబడితో బిజినెస్ మొదలుపెట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ 5 ఐడియాలు కేవలం ఒక ప్రారంభం మాత్రమే. మీకు (Business Idea) అభిరుచి, అంకితభావం, భిన్నంగా ఏదైనా చేయాలనే కోరిక ఉంటే.. తప్పకుండా విజయం సాధిస్తారు. మీరు ఏ బిజినెస్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. మీ కలలను నిజం చేసుకోవచ్చు. మీకు అంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందవచ్చు.

ఈ రోజుల్లో వ్యాపార అవకాశాలు విపరీతంగా పెరుగుతున్నాయి. సరైన మనస్తత్వం, గొప్ప ఆలోచనతో మీరు చాలా డబ్బు (how to make crores in business) సంపాదించడమే కాకుండా మీకంటూ ఒక పేరు కూడా సంపాదించుకోవచ్చు. కొన్ని వ్యాపారాలకు చాలా తక్కువ ప్రారంభ పెట్టుబడి అవసరం. కానీ, కొన్ని సంవత్సరాలలో మీకు భారీ ఆదాయాన్ని అందిస్తాయి. ఈ ప్రత్యేక వ్యాపార ఐడియాలు ట్రెండీగా ఉండటమే కాకుండా నేటి మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కూడా ఉంటాయి.

మీకు కష్టపడి పనిచేయాలనే తపన, మక్కువ ఉంటే.. ఈ 5 వ్యాపార ఆలోచనలు మీకు గేమ్-ఛేంజర్‌గా నిలుస్తాయి. ఆన్‌లైన్ కంటెంట్ క్రియేషన్ నుంచి అగరుబత్తుల తయారీ వరకు ఈ వ్యాపారాలు తక్కువ డబ్బుతో ప్రారంభమై లక్షలు సంపాదించుకోవచ్చు.

Advertisement
PM Kisan 22nd installment
PM Kisan 22nd installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. e-KYC మాత్రమే కాదు.. ఈ డాక్యుమెంట్ లేకున్నా 22వ విడత డబ్బులు రావు

Business Idea : సంపాదనకు అద్భుతమైన బిజినెస్ ఐడియాలివే :

మీకు అవగాహన, ఆసక్తి ఉన్న రంగంలో వ్యాపారాన్ని (earn Rs 1 crore business ideas) ప్రారంభించండి. మొదటి అడుగు వేయడం చాలా ముఖ్యం. చాలా కష్టం కూడా. మీ నైపుణ్యాల ఆధారంగా మంచి డబ్బు సంపాదించగల 5 టాప్ రేంజ్ బిజినెస్ ఐడియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆన్‌లైన్ కంటెంట్ క్రియేషన్, డిజిటల్ మార్కెటింగ్ :

ఇప్పుడంతా డిజిటల్ యుగం.. YouTube, బ్లాగింగ్ లేదా సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ కోసం డిమాండ్ వేగంగా పెరుగుతోంది. మీకు వీడియోలు క్రియేట్ చేయడం, డిజైన్ చేయడం లేదా రికార్డు చేయడం పట్ల మక్కువ ఉంటే.. ఇదే ఒక బ్రాండ్‌గా మొదలుపెట్టవచ్చు.

Business Idea
Business Idea

కేవలం స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌తో YouTube ఛానెల్‌ని ప్రారంభించండి లేదా ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయండి. ప్రారంభంలో నెలకు రూ. 15,000 నుంచి రూ. 50,000 వరకు ఆ తరువాత లక్షల్లో సంపాదన పెరుగుతుంది.

Advertisement
Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

Business Idea : వెడ్డింగ్ ప్లానర్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ :

దేశంలో పెళ్లిళ్లు, పెద్ద కార్యక్రమాలకు భారీగా డబ్బు ఖర్చు చేస్తారు. సమయం లేకపోవడం వల్ల ఈ రోజుల్లో వెడ్డింగ్ ప్లానర్ల సాయం అవసరంగా మారింది. చిన్న ఈవెంట్స్ ప్రారంభించండి. డీలర్లతో మీ నెట్‌వర్క్‌ను బిల్డ్ చేసుకోండి. ఒక్కో ఈవెంట్‌కు రూ. 50,000 నుంచి రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువగా సంపాదించుకోవచ్చు.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత తేదీ.. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు లేకుంటే రూ. 2వేలు పడవు.. ఏం చేయాలంటే?

హోం ఫుడ్, బేకరీ బిజినెస్ :

ఈ రోజుల్లో, ఇంట్లో తయారుచేసిన ఫుడ్, ప్రత్యేకమైన ప్రొడక్టులకు డిమాండ్  (Business Idea) వేగంగా పెరుగుతోంది. తాజా, రుచికరమైన ఆహారాన్ని అందరూ కోరుకుంటారు. టిఫిన్ బిజినెస్ ప్రారంభించండి. పచ్చళ్లు లేదా కేకులు తయారు చేయండి. వాటిని ఆన్‌లైన్‌లో అమ్మండి. మీరు సోషల్ మీడియా లేదా లోకల్ గ్రూపుల సాయం తీసుకోవచ్చు. నెలకు రూ. 20,000 నుంచి రూ. 1 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

Advertisement
IND vs SA 1st T20I Hardik Pandya Enters Elite T20 Club After Virat Kohli And Rohit Sharma
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

ఫిట్‌నెస్, యోగా కోచింగ్ :

ఫిట్‌నెస్, యోగాకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం ఎక్కవగా ఖర్చు చేస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకుంటారు. ఇందుకోసం ఫిట్‌నెస్, యోగా నిపుణులు లేదా హీలింగ్ కోచ్‌ల సాయం తీసుకుంటారు. ఆన్‌లైన్ లేదా లోకల్ క్లాసులను ప్రారంభించండి. అవసరమైన సర్టిఫికేషన్ పొందండి. నెలకు రూ. 20,000 నుంచి రూ. 50,000 వరకు అంతకన్నా ఎక్కువగానే సంపాదించుకోవచ్చు.

అగర్బత్తి, కొవ్వొత్తుల వ్యాపారం :

ఈ వ్యాపారంలో ఖర్చు చాలా తక్కువ. కానీ, ఆదాయాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పండుగల సమయంలో ఇలాంటి ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంటుంది. చిన్న మిషన్, ముడి పదార్థంతో (రూ. 5,000 నుంచి రూ. 20,000) ఖర్చు పెట్టి బిజినెస్ ప్రారంభించండి. నెలకు రూ. 30,000 నుంచి రూ. 1 లక్ష వరకు ఆదాయం పొందవచ్చు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

RELATED POSTS

Join our WhatsApp Channel