Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్‌కు ఏమైంది..? చావుబతుకుల్లో వెంటిలేటర్‌పై నరకయాతన.. ఈ దుస్థితికి కార‌ణం ఏంటి?!

Updated on: July 4, 2025

Fish Venkat : టాలీవుడ్ సినీఇండస్ట్రీలో విలన్, కమడియన్‌గా పేరొందిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. తీవ్ర అస్వస్థతకు (Fish Venkat) గురై ఆస్పత్రిలో చేరిన ఫిష్ వెంకట్ వెంటిలేటర్‌పై నరకయాతన అనుభవిస్తున్నాడు.

రోజురోజుకీ ఆరోగ్యం విషమించడంతో ఆయన అభిమానులు, సినీ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫిష్ వెంకట్ తొందరగా కోలుకోవాలని దేవున్నీ ప్రార్థిస్తున్నారు. వందకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఫిష్ వెంకట్ ఆరోగ్యం (Fish Venkat health condition) క్షీణించడంతో ఎలాగైనా కాపాడాలని వేడుకుంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నటుడు ఫిష్ వెంకట్ కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. షుగర్, బీపీతో పాటు కిడ్నీ సంబంధిత సమస్యలతో పోరాడుతున్నాడు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ఫిష్ వెంకట్ డయాలసిస్ నిర్వహిస్తున్నారు వైద్యులు..

Advertisement

Fish Venkat : కిడ్నీలు ఫెయిల్.. బతకడం కష్టం :

రోజురోజుకీ ఆరోగ్యం క్షీణించడం, వైద్యం కోసం ఖర్చు భారంగా మారడంతో సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని హాస్యనటుడు భార్య, కూతురు ప్రాధేయపడుతున్నారు. ఫిష్ వెంకట్ కు రెండు కిడ్నీలు (Fish Venkat Kidney Failure) పాడైపోయాయి. వెంటనే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయకపోతే బతికే అవకాశం చాలా తక్కువగా ఉందని వైద్యులు అంటున్నారు. ఎవరిని గుర్తుపట్టలేనంత స్థితికి చేరుకున్నారని అంటున్నారు.

Read Also : Vastu Tips : ఆర్థిక ఇబ్బందులా? మీ ఇంట్లో ఈ 4 మొక్కలు ఉంటే అంతా అదృష్టమే.. డబ్బులు వద్దన్నా వస్తూనే ఉంటాయి..!

కొన్నాళ్ల కిందట మద్యం తాగడం వల్ల షుగర్, కాలికి ఇన్‌ఫెక్షన్‌ వంటి అనారోగ్య సమస్యలు వచ్చాయి. అప్పట్లో కొందరు సినీ ప్రముఖులు, దాతల సాయంతో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత సినిమాలు తగ్గాయి. ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డాడు.

Advertisement

ఆ అలవాటు వల్లే ఈ దుస్థితి :

మద్యం, స్మోకింగ్ అలవాటు కారణంగా ఆయన మళ్ళీ ఈ దుస్థితికి వచ్చిందని ఆయన భార్య వాపోయారు. కొందరి వాళ్లే తన భర్తకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో ఉన్నా ఎవరూ చూసేందుకు రావడం లేదని బోరున విలపించారు.

అప్పట్లో దర్శకుడు వీవీ వినాయక్ తెరకెక్కించిన జూనియర్ ఎన్టీఆర్ ‘ఆది’ మూవీలో సింగిల్ డైలాగ్‌తో ఫిష్ వెంకట్ ఫేమస్ అయ్యాడు. “తొడకొట్టు చిన్నా” అనే డైలాగ్‌తో బాగా పేరుతెచ్చుకున్నాడు వెంకట్. ఆ తరువాత వరుసగా అనేక టాప్ హీరోల మూవీలో నటించి కామెడీ టైమింగ్‌తో అందరిని మెప్పించాడు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel