Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, , ,

WhatsApp Tricks : మీ ఫోన్లో నెంబర్ సేవ్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ పంపొచ్చు ఇలా..!

WhatsApp Tricks : వాట్సాప్ వాడుతున్నారా? మీ ఫోన్లో ఇతరుల వాట్సాప్ నెంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ చేయొచ్చు తెలుసా? ఇందుకు మీరు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇన్ స్టాల్

By Vinod Kumar

Published on: January 2, 2022 4:46 PM

Updated on: January 2, 2022 4:46 PM

whatsapp-tricks-whatsapp-message-can-send-to-anyone-without-saving-in-contact-list-of-your-phone

---Advertisement---

WhatsApp Tricks : వాట్సాప్ వాడుతున్నారా? మీ ఫోన్లో ఇతరుల వాట్సాప్ నెంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ చేయొచ్చు తెలుసా? ఇందుకు మీరు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాట్సాప్ లోనే నేరుగా నెంబర్ సేవ్ చేయకుండా సులభంగా పంపుకోవచ్చు. సాధారణంగా ఏదైనా వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ లేదా ఫొటో లేదా వీడియోను పంపాలంటే తప్పనిసరిగా ఫోన్ కాంటాక్టు లిస్టులో సేవ్ అయి ఉండాలి.

అప్పుడు మాత్రమే సదరు వ్యక్తికి వాట్పాప్ నెంబర్ నుంచి మెసేజ్ పంపే వీలుంది. అది కూడా ఆ వ్యక్తికి నెంబర్‌పై వాట్సాప్ అకౌంట్ ఉండి ఉండాలి. అప్పుడు మాత్రమే మెసేజ్ పంపడానికి వీలు అవుతుంది. వాట్సాప్ అకౌంట్ ఉండి.. అతడి నెంబర్ మీ ఫోన్ కాంటాక్టులో సేవ్ కాకపోయినా ఇలా సులభంగా మెసేజ్ పంపొచ్చు.. అది ఎలానో ప్రాసెస్ చూద్దాం..

Advertisement

WhatsApp Tricks : కాంటాక్ట్ లిస్ట్‌లో లేని నంబర్‌కు మెసేజ్ 

1. మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో బ్రౌజర్ (Browser) ఓపెన్ చేయండి.
2. https://wa.me/ అని Type చేయండి.
3. ఇక్కడ ఎవరికి పంపాలో వారి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి.
4. ఫోన్ నెంబర్‌లో కంట్రీకోడ్ (+91) తప్పనిసరిగా ఉండాలి.
5. మొబైల్ నెంబర్ Ex : 9999999999 (10అంకెలు) అనుకుంటే India Country Code +919999999999 ఇలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
6. మీరు https://wa.me/919999999999 అని టైప్ చేయాలి. URL మాదిరిగా ఇలా ఎంటర్ చేయాలి.
7. Continue to Chat అనే ఆప్షన్ Click చేయాలి.
8. Open WhatsApp క్లిక్ చేయాలి.
9. వాట్సప్ డెస్క్‌టాప్ (Whatsapp Desktop) యాప్ ఓపెన్ చేయండి.
10. మీకు ఏ మెసేజ్ పంపాలనుకుంటున్నారో పంపుకోవచ్చు.

Read Also : Andorid Users Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. ఈ 4 విషయాల్లో జర జాగ్రత్త!

, , , , , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :