...

Queen Elizabeth: క్వీన్ ఎలిజిబెత్ మరణాంతరం ఆకాశంలో చోటు చేసుకున్న అద్భుతం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Queen Elizabeth: బ్రిటన్ రాణి ఎలిజిబెత్ 2 గురువారం స్కాట్లాండ్‌లోని తన ఫామ్ హౌస్ లో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇలా బ్రిటన్ రాణిగా ఎంతో గుర్తింపు పొందిన ఈమె మరణించడంతో అందరూ ఒకింత షాక్ కి గురవ్వడమే కాకుండా తన ఆత్మ శాంతించాలని కోరుకున్నారు.అయితే క్వీన్ ఎలిజిబెత్ మరణించిన విషయాన్ని అధికారకంగా ప్రకటించిన తర్వాత ఆకాశంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది.

క్వీన్ ఎలిజిబెత్ మరణం తరువాత కొన్ని నిమిషాలకే ష్రాప్‌షైర్‌లోని టెల్ఫోర్డ్ ప్రాంతంపై ఆకాశంలో బంగారు వర్ణంలో ఎలిజబెత్‌ను పోలిన మేఘం కనిపించింది.
లిన్నేఅనే మహిళ కారులో వెళ్తుండగా ఆమె 11 ఏళ్ల కుమార్తె దీనిని గమనించి అమ్మ క్వీన్ అంటూ గట్టిగా అరవడంతో ఆమె ఈ దృశ్యాన్ని తన సెల్ ఫోన్లు బంధించి ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు నిజంగానే ఎలిజిబెత్ అంటూ ఆశ్చర్యపోతున్నారు.

 

Queen Elizabeth:

మరోవైపు శుక్రవారం క్వీన్‌ ఎలిజబెత్‌ అధికార నివాసమైన బకింగ్‌హామ్ ప్యాలెస్ మీదుగా రెండు ఇంద్రధనస్సులు కనువిందు చేశాయి. లండన్ ప్రజలు ఈ వింతను చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇలా ఇంద్రధనస్సులు ఏర్పడటం చూసిన లండన్ ప్రజలు ఇంద్రధనస్సు మీదగా క్వీన్ ఎలిజిబెత్ స్వర్గానికి వెళ్తుందని అభిప్రాయపడ్డారు. జర్నలిస్ట్ జెన్నిఫర్ వాలెంటైన్ ట్వీట్ చేసిన ఈ ఫొటో కూడా సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో పలువురు ఈ ఫోటోలు చూసి తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.