Brahmastra Movie Review : బ్రహ్మాస్త్ర రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?

Updated on: January 25, 2024

Brahmastra Movie Review : బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది రోజుల నుంచి వరుసలాప్ సినిమాలు ఎదురవుతూ బాలీవుడ్ ఇండస్ట్రీని కష్టాలలోకి నెట్టేసింది. అయితే బ్రహ్మాస్త్ర సినిమా ఈ కష్టాల నుంచి గట్టెక్కిస్తుందని అందరూ భావించారు. ఇక ఎన్నో అంచనాల నడుమ విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే…

Brahmastra Movie Review
Brahmastra Movie Review

ప్రముఖ నటుడు రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే… హిందూ పురాణాలను ఆధారంగా చేసుకుని తయారుచేసిన ఈ కథలో పురాణాలు, ఇతి హాసాల్లో ఉన్న శక్తులన్నింటినీ కలిసి అస్త్రావర్స్ క్రియేట్ చేశారు. ఆస్రాలకు బ్రహ్మదేవుడు అధిపతి మనిషి మనుగడకు కారణమైన పంచభూతాలను శాసించే శక్తి బ్రహ్మకు ఉంటుంది. ఇలా బ్రహ్మ శక్తి నుంచి పుట్టినది బ్రహ్మాస్త్రం.ఈ బ్రహ్మాస్త్రం ప్రపంచంలో ఉన్నటువంటి దుష్టశక్తులను తొలగించి ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటుంది.

War 2 Movie Review And Rating in Telugu
War 2 Movie Review : వార్ 2 మూవీ రివ్యూ.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సినిమా ఎలా ఉందంటే?

ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ శివ పాత్రలో నటించారు. ఈయన ఒక అనాధ ఈయన మరి కొంతమంది అనాధలతో కలిసి జీవిస్తూ ఉంటారు. ఈయన నిద్రపోతున్న సమయంలో ఈయనకు నిద్రలో మంట కలలో వస్తూ ఉంటుంది. ఇలా తన కలలో మంట రావడం దీనికి సంకేతము తెలియక సతమతమవుతూ ఉంటారు అదే సమయంలోనే తనకు ఇషా (అలియా భట్) పరిచయమవుతుంది.ఇక వీళ్ళిద్దరూ ప్రేమలో పడటం అనుకోకుండా వారణాసి వెళ్లి అక్కడ గురువు పాత్రలో ఉన్నటువంటి అమితాబచ్చని కలవడం జరుగుతుంది.

Advertisement

Brahmastra Movie Review : శివ పాత్రలో అదరగొట్టిన రణబీర్ కపూర్..

బ్రహ్మాస్త్రం నెగటివ్ శక్తుల చేతిలో పడకుండా వాటిని కాపాడమని ప్రపంచ పరిరక్షణ కోసం శివను తమతో కలవమని తమకు సహాయం సహకరించాలని అమితాబచ్చన్ అడుగుతారు. ఆ సమయంలో శివ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. మరి అతను ప్రేమ ఏమైంది.బ్రహ్మాస్త్రాలను కాపాడే శక్తి ఈయనకే ఎందుకు ఉంది అనే విషయం తెలియాలంటే సినిమాను చూడాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం రొటీన్ లవ్ స్టోరీ ని చూపించారు. మళ్లీ మెల్లిగా ఈ సినిమాని మెయిన్ కథలోకి తీసుకు వెళ్తూ వచ్చారు. ఇక క్లైమాక్స్ చాలా హెవీగా పెట్టినట్టు అనిపించింది కొన్ని సీన్స్ ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా చూపించారు. మొత్తానికి ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పలేము కానీ యావరేజ్ టాక్ సొంతం చేసుకుందనీ చెప్పాలి.

Thammudu Movie Review
Thammudu Movie Review : తమ్ముడు మూవీ రివ్యూ.. అక్క ఆశయం కోసం తమ్ముడి పోరాటం.. నితిన్ ఖాతాలో హిట్ పడినట్టేనా?

Read Also : Oke Oka Jeevitham Movie Review : శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Advertisement
UI Movie X Review
UI Movie Review : యూఐ మూవీ రివ్యూ.. ఈ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే? ఉపేంద్ర మళ్లీ ఇచ్చిపడేశాడుగా..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel