War 2 Movie Review : ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్ 2 మూవీ రానే వచ్చేసింది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో వార్ 2 మూవీ (War 2 Movie Review) రిలీజ్ అయింది. సినిమా రిలీజ్‌కు ముందే వార్ 2పై భారీ అంచనాలు పెరిగాయి. అందులోనూ మల్టీసార్టర్ మూవీ కావడంతో సినిమాకు బాగా హైప్ వచ్చింది.
టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఒకవైపు.. మరోవైపు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించడంతో సినిమాపై ఎక్కువ ఆసక్తిని రేకిత్తించింది. వీరిద్దరి కాంబినేషన్‌లో యాక్షన్ మూవీ కావడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది.
నటన పరంగా ఇద్దరూ గట్టి పోటీ ఇచ్చారు. నువ్వా నేనా అన్నట్టుగా అద్భుతంగా యాక్షన్ సీన్లలో నటించారు. ఇంతకీ ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించేలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం..
War 2 Movie Review : నటీనటులు :
ఎన్టీఆర్, హృతిక్ రోషన్, అనిల్ కపూర్, అశుతోష్ రాణా, కియారా అద్వానీ
నిర్మాణం : యశ్‌రాజ్ ఫిల్మ్స్
నిర్మాత : ఆదిత్యా చోప్రా
దర్శకత్వం : అయాన్ ముఖర్జీ
మ్యూజిక్ : ప్రీతమ్ పాటలు, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ : బెంజమిన్ జాస్పర్
రిలీజ్ డేట్ : ఆగస్ట్ 14, 2025
స్టోరీ :
వార్ 2 మూవీ వెరీ రొటీన్ స్టోరీ. అజ్ఞాతంలోని హృతిక్ రోషన్ కోసం సాగే మిషన్ ఇది. ఈ స్టోరీలో హృతిక్ కోసం పోలీస్ ఆఫీసర్లు స్పై ఆఫీసర్‌గా ఎన్టీఆర్‌ను దింపుతారు. అలా వెళ్లిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఏం చేశాడు. హృతిక్ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది స్టోరీ. వీరిద్దరి మధ్య సీన్లు ప్రేక్షకులకు మరింత మెప్పించేలా ఉంటాయి.
విశ్లేషణ :
మూవీ దర్శకుడు అయాన్ ముఖర్జీ స్టోరీని రొటీన్‌గా రాసుకున్నాడు. విజువల్స్ అంతగా ఆకట్టుకోలేదు. గ్రాఫిక్స్ సీన్లు తేలిపోయాయి. ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ సీన్లు బాగున్నాయి. సెకండ్ హాఫ్‌లో మాత్రం అంతగా సీన్లు పండలేదు. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హృతిక్-ఎన్టీఆర్ ఫైట్ సీన్లు, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా వచ్చాయి. క్లైమాక్స్, ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్‌లు సైతం బాగున్నాయి.
War 2 Movie Review : టెక్నికల్ అంశాలు :
వార్ 2 మూవీ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఎమోషనల్, ఎలివేషన్ సీన్లలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతగా వర్కౌట్ కాలేదు. ఇంకా బాగుంటే అద్భుతంగా ఉండేది. విజువల్స్ పర్వాలేదు. గ్రాఫిక్స్ ఆర్టిఫీషియల్ గా అనిపించాయి. ప్రత్యేకించి ఎడిటింగ్‌లో అవసరం లేని సీన్లను తొలగిస్తే బాగుండేది.
నటీనటులు ప్రదర్శన:
జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. తన పాత్ర పరిధిని మేరకు ఆకట్టుకున్నాడు. హృతిక్ రోషన్ కూడా అంతే స్థాయిలో మెప్పించాడు. ఇద్దరి కాంబినేషన్ సీన్లు ఆకట్టుకుంటాయి. హీరోయిన్ కియారా అద్వానీ పాత్రకు పెద్దగా స్కోపు లేనప్పటికీ తనదైన నటనతో ఆకట్టుకుంది.
ప్లస్ పాయింట్స్ :
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరి యాక్టింగ్ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరింది. ఫస్ట్ హాఫ్ ఫైట్ సీక్వెన్స్ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ, మ్యూజిక్, సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్లు చిరాకు పుట్టిస్తాయి
ఫైనల్ :
చివరిగా చూస్తే ‘వార్ 2’ మూవీ యాక్షన్, ఫైట్ సీన్లను చూసేవారికి అద్భుతంగా ఉంటుంది. కొత్తదనం కోరుకునేవారికి మాత్రం అంతగా ఆకట్టుకోదనే చెప్పాలి.
మూవీ రేటింగ్ : 2.5/5