...

Oke Oka Jeevitham Movie Review : శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Oke Oka Jeevitham Movie Review : శర్వానంద్ రీతు వర్మ జంటగా నటించిన ఒకే ఒక జీవితం సినిమా సెప్టెంబర్ 9వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా రివ్యూ రేటింగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమా: ఒకే ఒక జీవితం
నటీనటులు: శర్వానంద్, రీతు వర్మ, అమల, వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు.
దర్శకుడు: శ్రీకార్తీక్
డైలాగ్స్: తరుణ్ భాస్కర్
నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
సంగీతం: జోక్స్ జిజోయ్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్

కథ : 

సెప్టెంబర్ 9వ తేదీన విడుదలైన ఈ సినిమాలో ఆది (శర్వానంద్), శ్రీను (వెన్నెల కిషోర్), చైతు (ప్రియదర్శి) ముగ్గురు స్నేహితులు. అది మంచి గిటారిస్ట్. కానీ అందరి ముందు స్టేజ్ మీద పాట పాడటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. శర్వానంద్ ప్రేయసి వైష్ణవి ( రీతు వర్మ) ఇంత ఎంకరేజ్ చేసినా కూడా ఆది తన తల్లిని తలచుకుంటూ అందరి ముందు పర్ఫార్మ్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. శ్రీను చిన్నప్పుడు సరిగా చదువుకోకపోవడం వల్ల హౌస్ బ్రోకర్ గా మారుతాడు. దీంతో ఇంగ్లీష్ మాట్లాడటం సరిగా రాక ఇబ్బంది పడుతూ ఉంటాడు.

oke-oka-jeevitham-sharwanand-starrer-oke-oka-jeevitham-movie-review
oke-oka-jeevitham-sharwanand-starrer-oke-oka-jeevitham-movie-review

ఇక చైతు ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తూ ఉంటాడు కానీ తాను చూసిన అందరి అమ్మాయిలు కూడా తనకి నచ్చరు ఇలా వీరి ముగ్గురు వారి వారి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ క్రమంలో సైంటిస్ట్ రంగీ కుట్టా పాల్(నాజర్) వారి జీవితంలోకి ఎంటర్ అవుతాడు. సైంటిస్ట్ పాల్ టైం మెషిన్ కనిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎట్టకేలకు 20 సంవత్సరాల తర్వాత టైం మిషన్ కనిపెడతాడు. ఈ టైం మిషన్ సహాయంతో ఈ ముగ్గురు స్నేహితులను భూత కాలంలోకి పంపిస్తాడు. భూతకాలంలోకి వెళ్లిన వీరు ముగ్గురు వారు చేసిన తప్పులను సరిదిద్దుకొని క్రమంలో వారికి ఎదురయ్యే సమస్యలు ఏంటి? వాటిని వారు ఎలా అధిగమిస్తారు? అన్నదే ఈ సినిమా స్టోరీ.

టైం ట్రావెల్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా చూడగానే గతంలో వచ్చిన ఆదిత్య 369, 24 సినిమాలు గుర్తుకు వస్తాయి. సూర్య నటించిన 24 సినిమాలో కూడా సూర్య భూతకాలంలోకి వెళ్లి చిన్నతనంలో టైం మిషన్ కనిపెట్టడానికి తన తల్లిదండ్రులు ఎదుర్కొన్న సమస్యల గురించి తెలుసుకుంటాడు. అయితే ఇప్పుడు శర్వానంద్ నటించిన ఈ సినిమా మాత్రం ఆ సినిమాలతో ఎటువంటి పోలిక ఉండదు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాలో ముగ్గురు స్నేహితులు వారి వారి జీవితాలలో చేసిన పొరపాట్లను ఎలా సరిదిద్దుకుంటారు అన్నది చూపించారు.

ఈ సినిమాలో ఎక్కువగా అమ్మ సెంటిమెంట్ దాగి ఉంది. ఒకే ఒక జీవితం సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో నటించిన అమల ఆ పాత్రకు న్యాయం చేసింది. జీవితం ఎవరికి? రెండో అవకాశాన్ని ఇవ్వదు. ఒకవేళ ఇస్తే దానిని మనం ఎలా సరిదిద్దగలం అని పాయింట్ తో దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ సినిమాని ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో శర్వానంద్ అమల మధ్య ఉన్న ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

Oke Oka Jeevitham : ఒకే ఒక జీవితం సినిమా రివ్యూ.. శర్వానంద్ ఎలా చేశాడంటే? 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు వెన్నెల కిషోర్ పాత్ర ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. వెన్నెల కిషోర్ తన కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక శర్వానంద్ అమల మధ్య ఉన్న ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో టైం ట్రావెల్స్ నెమ్మదిగా ఉండటం మైనస్ గా చెప్పవచ్చు. ఇక శ్రీను చైతు క్యారెక్టర్ లను కూడా తమ కుటుంబ సభ్యులతో కలపకపోవడం కూడా ఒక మైనస్ పాయింట్. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ అందరికీ ఊహకందేలా ఉంది. ఇది ఒక మైనస్ పాయింట్. ఇక ఈ సినిమాకు సంగీతం అందించిన జోక్స్ విజయ్ సంగీతం బాగున్నప్పటికీ.. పాటలు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా లేవు.ఈ సినిమా చూసిన ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వస్తోంది.

రేటింగ్: 2.5/5