Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Karthika Deepam April 26 Today Episode : హిమపై కోపంతో రగిలిపోతున్న స్వప్న..సౌర్యను వెతికే పనిలో సౌందర్య..?

Karthika Deepam April 26 Today Episode :  తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరూపమ్, జ్వాలా కీ మన మధ్య స్వారీలు, థాంక్స్ లు ఉండకూడదు అని చెప్పడంతో జ్వాలా ఆనంద పడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా హిమ మామిడి కాయలు కోయడానికి నిరూపమ్ సహాయం చేస్తాడు. అప్పుడు ... Read more

By Ramesh Babu

Published on: April 26, 2022 8:51 AM

Updated on: April 26, 2022 5:02 PM

Karthika Deepam

---Advertisement---

Karthika Deepam April 26 Today Episode :  తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరూపమ్, జ్వాలా కీ మన మధ్య స్వారీలు, థాంక్స్ లు ఉండకూడదు అని చెప్పడంతో జ్వాలా ఆనంద పడుతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా హిమ మామిడి కాయలు కోయడానికి నిరూపమ్ సహాయం చేస్తాడు. అప్పుడు హిమ సంతోషంతో ఉండగా, అది చూసిన స్వప్న ఎలా అయినా హిమ ను నిరూపమ్ కి దూరం చేయాలి రోజురోజుకీ వీరి ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

Karthika Deepam
Karthika Deepam

మరోవైపు సౌందర్య ఆనంద్ రావు కారులో వెళ్తూ ఉండగా అప్పుడు నాకు సౌర్య కనిపించినట్టు కల వచ్చింది ఆ కల నిజమైతే బాగుండు అని అంటాడు. ఇంతలో వెనుక వైపు నుంచి వచ్చిన జ్వాల సౌందర్య కారును ఢీ కొడుతుంది. ఇప్పుడు సౌందర్య జ్వాలా పై విరుచుకు పడుతుంది.

జ్వాలా కూడా ఏ మాత్రం తగ్గకుండా సీనియర్ సిటిజన్ అంటూ సౌందర్య ని ఆట పట్టిస్తుంది. అంతేకాకుండా నీ కారు ఎంత అవుతుందో చెప్పు నేనే ఇస్తాను అని అనడంతో ఆనందరావు నవ్వుతాడు. ఇక ఆ తర్వాత జ్వాలాని నిన్ను చూస్తుంటే నా మనవరాలు గుర్తుకు వస్తుంది అంటూ ఎమోషనల్ అవుతాడు ఆనందరావు.

మరొకవైపు స్వప్న, హిమ పై కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో ఆనందరావు అక్కడికి రావడంతో, స్వప్న తన కోపాన్నంతా ఆనందరావు పై చూపిస్తుంది. అంతేకాకుండా జ్వాల, హిమ కు నేను ఏంటో చూపిస్తాను అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది.

మరొకవైపు జ్వాల ఆటో స్టాండ్ లో ఆటోలో కూర్చొని హిమ గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక ఆమె వచ్చి జూబ్లీహిల్స్ కి వస్తావా అని అడుగుతుంది. ఆమె జ్వాలా ఆటో నడుపుతున్నందుకు జ్వాలా పై ప్రశంసలు కురిపిస్తుంది. ఒకవైపు సౌందర్య, సౌర్యని వెతికే పనిలో భాగంగా సౌర్య చిన్నప్పటి ఫోటో నేను ఒక ఆమెకు చూపించి పెద్దయిన తర్వాత ఎలా ఉందో బొమ్మ గీయమని చెబుతుంది.

ఇంతలో జ్వాలా అక్కడికి వచ్చి తన చిన్నప్పటి ఫోటోని చూసి ఆశ్చర్యపోతుంది. అంతేకాకుండా సౌందర్య అక్కడికి ఎందుకు వచ్చిందో వివరాలను అడిగి తెలుసుకుంది. రేపటి ఎపిసోడ్ లో సౌందర్య, హిమ కీ పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటుంది. జ్వాలా, హిమ చిన్నప్పటి ఫోటో ని చూపించి తను కూడా బొమ్మను గీయించాలి అని అనుకుంటూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Karthika Deepam April 25Today Episode : సౌర్యపై కోపంతో రగిలిపోతున్న స్వప్న..నిరూపమ్ ను నిరాశ పరిచిన జ్వాలా..?

, , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.