Devatha: మాధవ మాటలకు షాక్ అయిన రాధ.. సంతోషంలో దేవుడమ్మ..?

Devatha: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసడ్ లో మాధవ ఎలా అయినా ఆదిత్య కు నీకు అష్టకష్టాలు పెడతాను అంటూ రాధకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు.

ఈరోజు ఎపిసోడ్లో ఆదిత్య దేవిని ఇంటికి తీసుకుని వెళ్లాలి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు దేవిని కారులో కూర్చోబెట్టి సత్యకు ఫోన్ చేయాలి అనుకుంటుండగా అప్పుడు దేవి నేను కారు నేర్చుకుంటాను అని అంటుంది. అది ఆదిత్య కూడా అందుకు సరే అని అంటాడు. అప్పుడు ఆదిత్య సత్యకు ఫోన్ చేసి దేవి ఇంటికి వస్తుంది అందరూ తన ఎదురుగా నిలబడాలి తనకి ఇష్టమైన టిఫిన్ చేసి పెట్టాలి అని అంటుండగా సత్య కోపంతో ఫోన్ కట్ చేస్తుంది.

Advertisement

ఆదిత్య దేవి విషయంలోని సంతోషంగా ఉంటాడు నాతో ఎప్పుడూ ఇంత సంతోషంగా మాట్లాడలేదు అని బాధపడుతుంది. మరొకవైపు రాధ, చిన్మయి ని స్కూల్ నుంచి తీసుకుని వస్తుంది. అప్పుడు మాధవ దేవి గురించి అడగగా, అప్పుడు రాధ చిన్మయిని లోపలికి పంపిస్తుంది. అప్పుడు ఇక మాధవ రాధతో ప్రతిసారి నేనే గెలుస్తున్నాను అంటూ మాట్లాడటంతో రాధ కూడా నువ్వు బాగా కలలు కంటున్నావు.

నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదు అని మాధవకు వార్నింగ్ ఇస్తూ నా బిడ్డ మా పెనిమిటి ఇంటికి వెళ్ళింది అనడంతో వెంటనే మాధవ నువ్వు బాధపడకు రాధ, దేవిని ఆదిత్య దగ్గరికి పంపిస్తాను అని అంటాడు.. అప్పుడు రాధ, మాధవ మాటలు విని ఆశ్చర్య పోతుంది. అప్పుడు మాధవ దేవిని పంపించేస్తే మన ఇద్దరికీ ఇటువంటి అడ్డు ఉండదు కదా అని అనడంతో రాధ కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

అప్పుడు రాధ గట్టిగా అరవడంతో అక్కడికి వెంటనే జానకి వస్తుంది. ఇలా ఉన్నావు అంటూ ప్రశ్నలు వేయగా రాధా కోపంతో జానకి పై అరుస్తుంది. మరొకవైపు దేవుడమ్మ గుమ్మం దగ్గర దేవి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే దేవి రావడంతో దేవితో కలసి మాట్లాడుతూ ఉంటుంది దేవుడమ్మ. ఇంతలోనే కమల తన కూతుర్ని తీసుకుని రావడంతో దేవి ఆ పాపతో సరదాగా ఆడుకుంటూ ఉంటుంది.

Advertisement

మరొకవైపు రాధా బాధగా ఉండటం చూసి జానకి బాధపడుతూ ఒక తల్లిలాగా అడుగుతున్నాను ఏమయిందో చెప్పు రాధ అనడంతో అప్పుడు రాధ ఏం చెప్పలేక లోలోపల కుమిలిపోతూ ఉంటుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel