Devatha: పిల్లలకు మాధవని దూరం చేయాలి అనుకున్న రాధ.. జానకమ్మ పై మండిపడ్డ మాధవ్..?

Devatha: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో మాధవ, రాధ తో మరొక సరికొత్త ప్లాన్ వేసినట్టు హింట్ ఇస్తాడు.

ఈరోజు ఎపిసోడ్ లో మాధవ, రాధా తో మాట్లాడుతూ మీరు దేవికి నిజం చెప్పడానికి ఒక సమయం అనుకోని ఉంటారు కదా అది నేను ఎట్టి పరిస్థితులలోను జరగనివ్వను. దేవి నేను చెప్పిన విధంగా చేసేలా చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఆదిత్య దేవి దగ్గరికి వెళ్ళగా అప్పుడు దేవి, చిన్మయిలు ఆనందంగా వెళ్లి హత్తుకొని పలకరిస్తూ ఉంటారు.

Advertisement

తరువాత భాగ్యమ్మ, రాధ మీ దగ్గరికి వెళ్లి ఆదిత్యాన్ని దేవి వాళ్ళ నాయన అని నువ్వు ఎందుకు చెప్పడం లేదు అని అనగా అప్పుడు వెంటనే రాధ ఏం చెప్పాలి అమ్మ దేవికి ఆ విషయం చెప్తే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఇక ఆ విషయం మా అత్తమ్మకు తెలిస్తే నన్ను పిలుచుకొని వెళ్తుంది అప్పుడు సత్య కోరుకున్న జీవితాన్ని నేను సత్యకి ఇవ్వలేను అని అంటుంది రాధ.

ఏదైనా అయితే దానికి కారణం నేనే అవుతాను అని అంటుంది. ఆ తర్వాత మాధవ ఆ వాచ్ చూస్తూ భలేగా మోసం చేశారు అంటూ ఆదిత్య వాళ్ళు చేసిన దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత భోజనం చేయడానికి కూర్చోగా పిల్లలు నాన్న ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడు రాధ వచ్చి భోజనం పెడుతుంది. అప్పుడే పిల్లలు ఏంటి అమ్మ నాన్న రాలేదు అని అడగగా..

అప్పుడు రాదా మనసులో ఇప్పటినుంచి పిల్లలను తీసుకొని రావడం, భోజనం తీసుకెళ్లడం అని నేనే చేయాలి అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత రాధ పిల్లలకు భోజనం తినిపించి ఇప్పుడే వస్తాను అని చెబుతుంది. మరొకవైపు మాధవ పిల్లలకు క్యారేజ్ తీసుకొని వెళ్తాను అని అనడంతో రాధ అప్పుడే తీసుకొని వెళ్ళింది అని చెబుతుంది జానకమ్మ.

Advertisement

అప్పుడు మాధవ రాధా కావాలనే నన్ను పిల్లలకు దూరం చేయాలని ఇలా చేసిందా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు మాధవా అక్కడి నుంచి వెళుతుండగా వెంటనే జానకమ్మ అసలు ఏం జరిగింది నువ్వు రాదని తిట్టావా? రాధ లో నాకు మార్పు కనిపిస్తోంది అని నిలదీస్తుంది. అప్పుడు మాధవ జానకమ్మ మీద అరుస్తూ నువ్వు నా గురించి నాన్న గురించి మాత్రమే పట్టించుకో వేరే వాళ్ల గురించి నీకు అనవసరం అని కోపంగా అరిచి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

అప్పుడు జానకమ్మ తన మనసులో మొదటిసారిగా మాధవ నా మీద కోప్పడ్డాడు. అసలు ఏదో జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రామ్మూర్తి అక్కడికి రావడంతో రామ్మూర్తికి జరిగిన విషయాన్ని వివరిస్తుంది జానకమ్మ.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel