Guppedantha Manasu : గౌతమ్ లవ్ లెటర్‌తో జగతి ముందు అడ్డంగా బుక్కయిన రిషి!

Updated on: January 11, 2022

Guppedantha Manasu : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక రిషి కారులో కాలేజ్ దగ్గరికి రాగానే వెంటనే వసుధార రిషి కి తాను ఉన్న ప్లేస్ గురించి వాయిస్ మెసేజ్ చేస్తుంది. వెంటనే రిషి తాను పిలిస్తే నేను వెళ్లాలా అనుకుంటూ వాయిస్ మెసేజ్ కు రిప్లై ఇవ్వడు. దీంతో వసు సార్ రిప్లై ఇవ్వడం లేదు ఏంటి అని అనుకుంటుంది.

కానీ అప్పటికే రిషి వసు దగ్గరికి వెళ్తాడు. ఇక కాసేపు రిషితో మాట్లాడుతుంది. కానీ రిషి మాత్రం కాస్త వెటకారం గా మాట్లాడినట్లు కనిపిస్తాడు. అంతలోనే వసుధార తన దగ్గరున్న చాక్లెట్ ను తీసి తినాలనిపిస్తుంది అని మాట్లాడుతుంది. ఇక రిషి దీనికి కూడా నా పర్మిషన్ కావాలా అని అనటంతో.. మీరు తింటే నేను తినగలను అని అంటుంది.

అలా ఆ చాక్లెట్ ను ఇద్దరు తీసుకొని తింటారు. ఇక రిషి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత వసు తనలో తాను.. ఏం చేస్తున్నానో అని అనుకుంటుంది. మరోవైపు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మీటింగ్ జరుగుతూ ఉండగా అందులో రిషి చాక్లెట్ షార్ట్ ఫిలిం చేస్తున్నాం కదా అని అనడంతో అందరు షాక్ అవుతారు. వెంటనే రిషి మాట మారుస్తూ మాట్లాడుతాడు.

Advertisement

Guppedantha Manasu : అసలు ఆ లవ్ లెటర్‌లో ఏముంది? 

గౌతమ్ రిషి క్యాబిన్ లో కూర్చొని రిషి ఫోటో చూసుకుంటూ.. అవునురా వసుధారని ప్రేమిస్తున్నా.. అయితే నీకేంటి అని అనుకుంటూ ఉండగా అప్పుడే రిషి వస్తాడు. ఏం లేదు అంటూ తడబడుతూ ఉంటాడు. ఇక తనకు ఓ లవ్ లెటర్ రాసి ఇవ్వాలి అని.. అమెరికా గ్రూపులో ప్రేమలేఖలు పోటీ పెట్టారని అందుకోసం నువ్వే ఒక లేఖ రాయాలి అని అనడంతో దానికి రిషి ఒప్పుకుంటాడు.

వెంటనే వసును ఊహించుకొని లవ్ లెటర్ రాస్తాడు. మరోవైపు ధరణి వసు బొమ్మను చూసి గౌతమ్ గీసాడు అనుకొని ఈ విషయం ఎలాగైనా మహేంద్ర కు చెప్పాలని అనుకుంటుంది. అప్పుడే దేవయాని వచ్చి తనతో కాసేపు వెటకారంగా మాట్లాడుతుంది. గౌతమ్ ఆ లవ్ లెటర్ ని తీసుకొని వెళ్లి వసు బుక్ లో పెడతాడు. ఆ లెటర్ జారిపోవడం తో జగతి తీసి చూస్తుంది. వెంటనే గౌతమ్ అక్కడికి వెళ్లటం తో ఎవరో లవ్ లెటర్ రాశారు అని ఎలాగైనా వీరిని వదిలేదని రిషితో అంటుంది. ఇక రిషి గౌతమ్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఆ లెటర్ రాసింది రిషి అని తెలిస్తే మాత్రం రిషి అడ్డంగా బుక్ అవడం గ్యారెంటీ.

Read Also : Karthika Deepam: పిల్లల భోజనం కోసం హోటల్ లో పని చేయడానికి సిద్ధమైన డాక్టర్ బాబు!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel