సీనియర్ల విషయాల్లో రేవంత్ రెడ్డికి సంచలన విషయాలను చెప్పిన రాహుల్.. ఏంటవి.?

Updated on: October 9, 2024

కష్టంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడాలని, అధికారం దిశగా అడుగులు వేయించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నా కూడా ఇతర నేతలు మాత్రం కలిసి రావడం లేదు. పార్టీ కొంచెం ఊపు వస్తుందనుకుంటున్న సమయంలోనే వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువయ్యారు. ఆ పార్టీలో అది సహజమే అయినా ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతే కష్టమే.రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియమితులైన దగ్గర్నుంచి పార్టీ సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ నేతలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.

సారథిగా కొన్ని నిర్ణయాలు సొంతంగా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని నిర్ణయాలు అందరితో కలిసి చర్చించి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ లో ఇందు కోసం ఒక కమిటీని నియమించారు. ఈ జంబో కమిటీ సమావేశం పై నిర్ణయం తీసుకునే సరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. అందుకే కొన్ని నిర్ణయాలను రేవంత్ రెడ్డి స్వయంగా తీసుకుంటున్నారని, ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. కానీ దీనికి మిగిలిన నేతలు అంగీకరించడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న తపన ఎవరికీ లేనట్లే కనిపిస్తుంది. ఒకవైపు అధికార పార్టీ వివిధ పథకాలు అమలు చేస్తూ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతోంది. అలాగే బిజెపి కూడా బలపడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement

రెండు పార్టీలను అధిగమించి ముందుకు వెళ్లాల్సిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కలహాలతో కాలక్షేపం చేస్తుంది. దీనివల్ల పార్టీ క్యాడర్ కు కూడా పని చేయవలసిన పరిస్థితులు కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు ఈ దుస్థితి రావడానికి నేతల వ్యవహార శైలి కారణం అంటున్నారు. ప్రజల్లో బలంలేని నేతలు సైతం తనకు చెప్పి కార్యక్రమాలు చేయాల్సిందేనన్న షరతులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డే కాదు, ఎవరు పీసీసీ చీఫ్ గా ఉన్న ఈ విభేదాలు మామూలే. అయితే రేవంత్ రెడ్డి పార్టీకి చేస్తున్న మీరు అధిష్టానం గుర్తించింది. అయితే రేవంత్ దూకుడు పార్టీకి మేలు చేస్తుండటం అధిష్టానం గుర్తించింది. సీనియర్ల సలహాలు తీసుకోండి, వారి విమర్శలు పట్టించుకోవద్దు. వారి వ్యవహారాన్ని తమకు వదిలేసి, మీరు ముందుకు సాగండి అని రాహుల్,రేవంత్ కి అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel