Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Narendra Modi : సింగరేణి ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే?

PM Narendra Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎట్టకేలకు సింగరేణి ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు. సింగరేణి బొగ్గు గనులపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మోదీ మండిపడ్డారు. ప్రత్యేకించి కొందరు హైదరాబాద్ నుంచి కావాలనే రెచ్చగొడుతున్నారని మోదీ విమర్శించారు. సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం, రాష్ట్ర వాటా 51 శాతంగా ఉందని తెలిపారు. సింగరేణి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికే ఎక్కువగా ... Read more

By Ramesh Babu

Published on: November 12, 2022 9:18 PM

Updated on: November 12, 2022 9:18 PM

PM Narendra Modi Gives Clarity on Singareni Privatization

---Advertisement---

PM Narendra Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎట్టకేలకు సింగరేణి ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు. సింగరేణి బొగ్గు గనులపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మోదీ మండిపడ్డారు. ప్రత్యేకించి కొందరు హైదరాబాద్ నుంచి కావాలనే రెచ్చగొడుతున్నారని మోదీ విమర్శించారు. సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం, రాష్ట్ర వాటా 51 శాతంగా ఉందని తెలిపారు.

PM Narendra Modi Gives Clarity on Singareni Privatization
PM Narendra Modi Gives Clarity on Singareni Privatization

సింగరేణి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికే ఎక్కువగా అధికారం ఉంటుందని మోదీ అన్నారు. కేంద్రం నుంచి సింగరేణిపై ఎలాంటి ప్రైవేటీకరణ ప్రతిపాదన లేదన్నారు. విశాఖ పర్యటన ముగిసిన అనంతరం మోదీ హైదరాబాద్‌కు బయలుదేరారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోదీకి గవర్నర్ తమిళిసై, మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వాగతం పలికారు. బేగంపేట ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుతూ.. చిన్న కార్యకర్త స్థాయి నుంచి తాను ప్రధానిగా ఎదిగానని అన్నారు.

Narendra Modi : తెలంగాణలో బీజేపీ వికసిస్తోంది.. 

తెలంగాణ బీజేపీ శ్రేణుల పోరాటం తనలో స్ఫూర్తిని నింపుతుందని చెప్పారు. ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ కమలం వికసిస్తుందని మోదీ తెలిపారు. మునుగోడు ప్రజలు బీజేపీపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మునుగోడుకు వచ్చిందని, బీజేపీ పోరాటం వల్లే సాధ్యమైందని మోదీ అన్నారు. తెలంగాణాలో ప్రతి ఉపఎన్నిక బీజేపీ బలోపేతాన్ని నిరూపిస్తుందని చెప్పారు.

PM Narendra Modi Gives Clarity on Singareni Privatization
PM Narendra Modi Gives Clarity on Singareni Privatization

తెలంగాణలో కమల వికాసం కనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. బేగంపేటలో ప్రధాని ప్రసంగం వాడివేడిగా సాగిందనే చెప్పుకోవాలి. పరోక్షంగా కేసీఆర్ పాలనపై మోడీ విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుందని మోదీ స్పష్టం చేశారు. ఎరువుల ఉత్పత్తి, సింగరేణి ప్రైవేటీకరణతో పాటు రైతుల సంక్షేమంపై మోదీ ప్రసంగించారు.

Read Also : Samantha : సమంత జాతకంలో ఏముంది? అందుకే ఇన్ని కష్టాలా? మళ్లీ ఆ ఘోరం జరగబోతుందా?!

,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే