MLC bharath counter: లోకేష్ కు సీఎం గురించి మాట్లాడే అర్హత లేదు – ఎమ్మెల్సీ భరత్

MLC bharath counter: ఏపీ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంపై సీఎ జగన్ ఫఓకస్ పెట్టారు. తాజాగా నారా లోకేష్ కు కుప్పం వైసీపీ ఇంఛార్జీ, ఎమ్మెల్సీ భరత్ కౌంటర్ ఇచ్చారు. నారా లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్సీ భరత్ మండిపడ్డారు. వైసీపీ నాయకులను లోకేష్ కుక్కలు అనడం ఏంటని ప్రశ్నించారు. అలో మరోసారి మాట్లాడితే ఊరుకునేది లేదని.. ఫైర్ అయ్యారు. సీఎం జగన్, పెద్దిరెడ్డిల గురించి మాట్లాడే స్థాయి లోకేష్ కు లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు.

మాట మాట్లాడేముందు చాలా జాగ్రత్తగా ఉండాలని.. నోరు జారితే అస్సలే బాగుండదని తెలిపారు. మేము ఇచ్చే షాక్ లకు తండ్రీ కొడుకులకు ఇది వరకే మతిపోయిందని… కుప్పంలో సభ్యత నమోదు పేరిట ప్రజల డబ్బు దోచుకొని ఆరోగ్యా బీమా అన్నారని తెలిపారు. ఎంత మందికి ఉచిత వైద్యం ఇచ్చారో చెప్పాలని భరత్ డిమాండ్ చేశారు. కుప్పం నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారో చర్చకు రావాలని అన్నారు. కుప్పంలో మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు ప్రైవేటు వారివన్నారు. హంద్రీనీవా, పాలారు ప్రాజెక్టులను చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేదని ఎమ్మెల్సీ భరత్ ప్రశ్నించారు ప్రభుత్వ వైద్య కళాశాలలను కుప్పం ఎందుకు మంజూరు చేయలేదో చంద్రబాబు చెప్పాలన్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel