Karthika Deepam : కార్తీక దీపంలో హైలెట్ సీన్.. ఏకంగా డాక్టర్ బాబు పనిచేసే హోటల్ కు వెళ్లిన సౌందర్య, ఆనందరావు!

Updated on: January 22, 2022

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మోనిత బాధ తట్టుకోలేక అత్తయ్య మామయ్యలు ప్రకృతి వైద్యశాలకి వచ్చి ఉంటారా? అని దీప మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు మోనిత బస్తీ లో ఉండే లక్ష్మణ్ ని ఇంటికి రమ్మని చెబుతోంది.

లక్ష్మణ్ వచ్చిన తర్వాత మోనిత తన కొడుకును ఎత్తుకెళ్లిన వ్యక్తి ఫోటో చూపించి ఆ వ్యక్తిని ఎలాగైనా పట్టుకోవాలని చెబుతుంది. అంతే కాకుండా దీని కోసం ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అని చెబుతోంది. దానికి లక్ష్మణ్ ‘మేడం నాకు ఆ పని కుదరదని చెప్పగా’ మోనిత, పర్వాలేదు లక్ష్మణ్ మీ ఆవిడకు కడుపు నొప్పి ట్రీట్మెంట్ చేసినందుకు నాకు లక్ష యాభై వేలు ఇవ్వు ఎలాగైనా.. నా బాబు ను నేనే వెతుక్కుంటాను అని అంటుంది.

దానికి అది విన్న లక్ష్మణ్ ఒక్కసారిగా స్టన్ అవుతాడు. నా బాబును నేను ఎలా వెతుకోవాలో అని మోనిత వెటకారంగా చెబుతుంది. మరో వైపు దీప, కార్తీక్ పనిచేస్తున్న హోటల్ లో ఉదయాన్నే వంటలు వండడానికి వెలుతుంది. మరోవైపు కార్తీక్ ఇంట్లో పిల్లలకు భోజనం తినిపిస్తూ ఉంటాడు.

Advertisement

ఆ తర్వాత కార్తీక్ బాబును పక్కింటి వాళ్ళకి ఇచ్చి నేను బయటికి వెళ్లి వచ్చే వరకు కాస్త చూసుకోండి అమ్మ అని చెబుతాడు. మరోవైపు రుద్రాణి ఆ బాబు ని తీసుకు రమ్మని తన తమ్ముడిని పంపిస్తుంది. ఆ తర్వాత అప్పారావు దీపను బావ ఏం చేస్తాడు అక్క అని అడిగి ఊరికే విసిగిస్తూ ఉంటాడు. అదే కాకుండా బావను కూడా హోటల్ కి తీసుకొస్తే.. ముగ్గురం కలిసి ఎంచక్కా ప్లేట్లు కడుకోవచ్చని అంటాడు.

దానికి దీప అప్పారావు మీద ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతుంది. మరోవైపు సౌందర్య, ఆనందరావు లు కార్తీక్, దీప పనిచేసే హోటల్ కే వస్తారు. ఆ హోటల్లో వాళ్ళ తల్లిదండ్రులని చూసిన కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత రుద్రాణి ఎట్టకేలకు బాబును తన ఇంటికి ఎత్తుకొని వస్తుంది. అది తెలుసుకున్న దీప రౌద్ర రూపంతో రుద్రాణి ఇంటికి బయలుదేరుతుంది. మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఏమవుతుందో చూడాలి.

Read Also : Karthika Deepam : దీపను ఎంక్వయిరీ చేస్తున్న సౌందర్య, ఆనందరావు.. అనుమానంలో డాక్టర్ బాబు!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel