వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Karthika Deepam june 27 Today Episode : నిరుపమ్ చేసిన పనికి షాక్ అయిన హిమ.. దగ్గరవుతున్న జ్వాలా, సౌందర్య..?

Karthika Deepam june 27 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌందర్య,ఆనందారావ్ లు జ్వాలానీ తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో హిమ, నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి జ్వాలా వస్తుంది. హిమను చూసిన జ్వాలా నీ మొఖం నాకు చూపించొద్దు అని ... Read more

By Ramesh Babu

Published on: June 27, 2022 9:57 AM

Updated on: June 27, 2022 10:09 AM

Karthika Deepam june 27 Today Episode

---Advertisement---

Karthika Deepam june 27 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌందర్య,ఆనందారావ్ లు జ్వాలానీ తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో హిమ, నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి జ్వాలా వస్తుంది. హిమను చూసిన జ్వాలా నీ మొఖం నాకు చూపించొద్దు అని చెప్పాను కదా అంటూ చిరాకు పడుతుంది. అప్పుడు హిమ జ్వాలా కి సర్ది చెప్పడానికి ఎంత ప్రయత్నించినా కూడా జ్వాలా మాత్రం హిమను మాట్లాడనివ్వకుండా కోప్పడుతూ ఉంటుంది.

Karthika Deepam june 27 Today Episode
Karthika Deepam june 27 Today Episode

నువ్వు తింగరి కాదు మోసకారివి అంటూ నానా మాటలు అంటుంది. ఇప్పుడు హిమ జ్వాల దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించగా దగ్గరికి రావద్దు అని ఉంటుంది జ్వాలా. నీ పేరు ఏంటో చెప్పవా నీ పేరు కూడా నా శత్రువు పేరు పక్కనే పచ్చబొట్టు పొడిపించుకుంటాను అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

ఇక మరింత రోజు ఉదయాన్నే హిమ,జ్వాల అన్న మాటలను తలుచుకొని బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి ఆనందరావు వస్తాడు. ఆనందరావు, హిమ మాట్లాడుతూ ఉండగా అప్పుడు స్వప్న, నిరుపమ్ లు పెళ్లి శుభలేఖ తీసుకొని వస్తారు. ఇక పెళ్లి పత్రికలు చూసిన హిమ ఒక్కసారిగా షాక్ అవుతుంది.

అప్పుడే పెళ్లి పత్రికలు కూడా కొట్టించారా అని అడగగా అప్పుడు నిరుపమ్ అప్పుడేనా ఏంటి హిమ మన పెళ్లి శనివారమే కదా అని అంటాడు. ఆ తర్వాత స్వప్న ఆనందరావుకి పెళ్లి పత్రిక ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు సౌందర్య, జ్వాలా ఇంటికి వెళ్లగా అక్కడ ఇల్లు మొత్తం గందరగోళంగా ఉండటంతో సౌందర్య, జ్వాలా దగ్గరికి వెళ్లి జ్వాలా నిద్ర పోతూ ఉండడంతో తనను డిస్టర్బ్ చేయకుండా ఇల్లు మొత్తం క్లీన్ చేసి వాకిట్లో ముగ్గు కూడా వేస్తుంది.

మరొకవైపు ఆనందరావు, హిమ లు జరిగిన విషయం తలచుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు హిమ, జ్వాలాకి బావకి పెళ్లి చేయడానికి నాకు హెల్ప్ చెయ్ తాతయ్య అని ఆనంద్ రావ్ అని అడుగుతుంది. మరొకవైపు జ్వాల నిద్ర లేచి చూడగా ఎన్ని మొత్తం క్లీన్ గా ఉండడంతో జ్వాలా ఆశ్చర్యపోతుంది.

ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు నీకు ఎందుకు సీసీ అని అనడంతో ఇందులో నాకు శ్రమ ఏమీ లేదు అని అంటుంది సౌందర్య. అలా వారిద్దరూ కాసేపు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also :  Karthika Deepam june 25 Today Episode : జ్వాలాకి గోరుముద్దలు తినిపించిన సౌందర్య.. సౌర్యని తలచుకొని బాధ పడుతున్న సౌందర్య..?

, , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel