Devatha: రాధను అనుమానించిన మాధవ్‌!?… దేవితో రాధ ఎందుకు ఒట్టు వేయించుకుంటుంది?

Updated on: March 23, 2022

Devatha: దేవిని హాస్పటల్ నుంచి తీసుకొని రాధ ఇంటికి వస్తుంది.. దేవి ఇంటికి రాగానే చిన్మయి చూసి ఏడుస్తుంది. నేను నీ పక్కనే ఉంటే ఈ దెబ్బ తగిలినిచ్చే దాన్ని కాదు అంటూ చిన్మయి దేవితో అంటుంది. దేవి, చిన్మయిల మధ్య ఉన్న అక్కాచెల్లెల అనుబంధం ఇంట్లో అందరిని కదిలిస్తుంది.. అక్క చెల్లెలు అంటే మీలా ఉండాలి అంటాడు వాళ్ల తాతయ్య. ఇలా ఫిబ్రవరి 14 2022 ఎపిసోడ్ హైలైట్స్ ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఇంకా డీటైల్‌గా ఎపిసోడ్‌ వివరాలపై ఓ లుక్కెయ్యండి..!

devatha latest episodes highlights

కళ్లముందే కూతరు కనిపిస్తున్నా నిజం చెప్పలేని నిస్సహాయ స్థితిలో తండ్రి.. తన చెల్లెలి కాపురం బాగుండాలని నిజం దాచి అందరికీ దూరంగా పేరు, ఊరి మార్చి పరాయిమనిషిగా జీవనం గడుపుతున్న ఓ వివాహిత జీవితం ఎలాంటి మలపులు తీసుకుని తిరిగి కుటుంబానికి దగ్గరవుందా అనే నేపథ్యంలో సాగుతున్న మా టీవీలోని ట్రెండింగ్‌ సీరియల్‌ “దేవత” మరి ఇందులో రాధ సత్య భర్తగా నటిస్తున్న ఆదిత్య, దేవీ క్యారెక్టర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రతి తెలుగింటికి వీరు సుపరిచితమే..!

Advertisement

మరి ఇవ్వాల్టి ఎపిసోడ్‌లో మాధవ్ ని చూస్తూ ఏంటి సారు ఇక్కడున్నారు అని రాధ ప్రశ్నిస్తుంది. రాధా నిన్ను ఒక విషయం అడగాలి అంటాడు మాధవ్‌.. రాత్రి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లావు.. బయటకు వెళ్తే చెప్పకుండా వెళ్ళవు కదా అంటాడు. చెబుదాం అనుకున్నాను మీరు కనిపించలేదు సారూ అంటుంది రాధ. మరీ బయట ఎక్కడో ఉన్న నీకు దేవికి దెబ్బ తగిలిన విషయం ఎలా తెలిసింది..!? ఎవరైనా ఫోన్ చేయడానికి నీ దగ్గర ఫోన్ కూడా లేదు కదా అని మాధవ్‌ రాధను ప్రశ్నిస్తాడు. రాత్రి గుడిలో సహస్రాభిషేకం చేస్తున్నారంటే వెళ్లాను.. అక్కడినుంచి తిరిగి వస్తుంటే దేవమ్మ కనిపించింది సార్‌. దేవమ్మను పిలుస్తుండగా ఇంతలోనే తనకు దెబ్బతగిలింది. దేవికి దెబ్బతగిలి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆఫీసర్ వచ్చి తనను దావఖానకు తీసుకుపోయారు అని మాధవ్‌కు వివరిస్తుంది రాధ.

ఏంటి సార్ ఏమైంది అట్లా అడుగుతున్నారు అని రాధ ప్రశ్నిస్తుంది.. ఏం లేదు రాధ.. నేను పిల్లల్ని ఆదిత్య దగ్గరకు వెళ్ళద్దు అని ఎంతలా చెబుతున్నా వాళ్లు వినడంలేదు. వాళ్ళు వెళ్లకుండా చూసుకునే బాధ్యత నీదే రాధ అని మాధవ్ చెప్తాడు.

ఇక రాధ దేవిని ఆదిత్య దగ్గరకు వెళ్లకుండా చేయడానికి తనతో మాట్లాడకుండా ఉంటుంది. దేవి అమ్మ నాతో ఎందుకు మాట్లాడటం లేదు అని అడుగుతుంది.. దానికి రాధ నీకు నాకన్నా ఆఫీసర్ సార్ ఎక్కువ కదా.. నన్ను వదిలేసి నువ్వు తన దగ్గరకే వెళ్ళిపోతావు కదా అని అంటుంది. లేదమ్మా నువ్వంటేనే ఇష్టం అని దేవి అంటుంది. దానికి రాధ ఆఫీసర్ సార్‌తో మాట్లాడనని తన దగ్గరకు వెళ్లని నా మీద ఒట్టు వేయమని దేవితో రాధ ప్రమాణం తీసుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్‌ కొనసాగుతుంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel