Devatha: ఆదిత్యకు ఎటువంటి సమస్య లేదనే నిజం సత్యకు తెలుస్తుందా… దేవుడమ్మకు ఆదిత్య ఏం చెప్తాడు..?

Devatha: బుల్లితెరపై ప్రేక్షకాధరణాభిమానాలు పొందుతున్న ధారావాహిక దేవత. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరియల్‌ లేటెస్ట్‌ ఎపిసోడ్‌ హైలెట్స్‌ ఏంటో చూసేద్దాం.

devatha serial latest episode

పార్క్‌లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది దేవుడమ్మ. అక్కడికే వచ్చిన చిన్మయి దేవి ఏమయ్యింది అవ్వ అని అడుగుతారు. నాకు బాధగా అనిపించినప్పుడుల్లా ఇలా వచ్చి కూర్చుంటాను అంటుంది. నాకు బాధను తీర్చడానికి ఎవరు లేరుకదా అంటుంది దేవుడమ్మ నీకు బాధేముంది అని అవ్వ అంటుంది దేవీ. నీకు తెలియదు అంటుంది దేవుడమ్మ. నువ్‌ నా కొడుకుతో ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుంతుంది. నేను ఆఫీసర్‌ సారుతో మాట్లాడను అని చెప్పాను కాని నీతో మాట్లాడను అని చెప్పానా అంటుంది దేవి దేవుడమ్మతో. అయితే అప్పుడప్పుడు నన్ను చూడడానికి వస్తావా అంటుంది దేవుడమ్మ. హో తప్పకుండా అంటుంది దేవి.

Advertisement

ఇంతలో పిల్లలు ఇంకా స్కూలు నుంచి రాలేదేంటా అని రాధ కంగారు పడుతుంది. ఎవరు పిల్లల్ని తీసుకురావడానికి వెళ్లారు అని రాధ వాళ్ల అత్తయ్యని అడుగుతుంది వాళ్ల తాతయ్య వెళ్లారు తీసుకువస్తారు లే అమ్మ… ఎందుకంత కంగారు అంటుంది రాధ వాళ్ల అత్తయ్య. అంతలో పిల్లలతో రాధ వాళ్ల తాతయ్య ఇంటికి వస్తారు.

మరోవైపు రాధ వాళ్ల పెనిమిటి పిల్లలకు దూరం అయ్యి ఎంత బాధపడుతుంటాడో అని ఆలోచిస్తూ ఆవేదన చెందుతుంది. ఇంతలో కమలకు కష్టం రాకుండా బాష కంటికి పాపల చూసుకుంటుంటాడు.

కట్‌చేస్తే రాధ పిల్లలను నిద్రపుచ్చి వాళ్ల పెనిమిటి అన్న మాటలను గుర్తుచేసుకుని ఏడ్చుస్తూ ఆలోచిస్తుంది. నా పెనిమిటి ఎప్పుడూ ఇంత ఆవేశంగా మాట్లాడలేదు. ఆఫీసర్‌ సరే వాళ్ల నాన్న తెలిసిన తర్వాత దేవి నన్ను అసహ్యించుకుంటుందా అని ఆలోచిస్తూ ఏడుస్తుంది. ఏమైనా సరే పెనిమిటికి నా బిడ్డను ఇవ్వనూ అంటూ మనసులో అనుకుంటుంది. ఈ ఇళ్లు ఈ ఇంటి మనసులు నా వాళ్ల కాదని ఈ ఇంటితో నాకెటువంటి సంబంధం లేదు అని తెలిస్తే నన్ను ఈ ఇంట్లో ఉండనిస్తాడా సీదా ఇంటికి తీసుకెళ్తాడు అప్పుడు నా చెల్లి జీవితం ఏం కావాలి అని రాధ బాధపడుతూ ఉంటుంది.

Advertisement

సీన్‌ కట్‌ చేస్తే సత్య గార్డెన్‌లో మొక్కలను ట్రిమ్‌ చేస్తూ ఉంటుంది. మొక్కల చాటున పడేసిన మెడిసిన కనిపిస్తాయి అవన్నీ ఆదిత్య పిల్లలు పుట్టడం కోసం వేసుకోవాల్సిన మాత్రలే కదా అని సత్య ఆ మాత్రలను తీసుకుని చూస్తుంది. ఆ మాత్రలను తీసుకుని వెళ్లి దేవుడమ్మకు చూపిస్తుంది. ఆదిత్య రోజు టాబ్లెట్స్‌ వేసుకోకుండా మొక్కల్లో పారేస్తున్నారని చెప్తుంది. అసలు ఆదిత్య ఎందుకు ఇలా చేస్తున్నాడా అని దేవుడమ్మ, సత్య, దేవుడమ్మ భర్త అనుకుంటారు. దానితో ఆదిత్య ఎక్కడ అని కోపంగా దేవుడమ్మ సత్యను అడుగుతుంది. ఇంక ఆదిత్య ఆ మాత్రల గురించి నిజం చెప్తాడు అసలు ఏం జరగబోతుంది అనే తరువాయి భాగంలో చూడాల్సిందే.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel