Contract wedding: దిమ్మతిరిగే షరతులతో కాంట్రాక్ట్ వెడ్డింగ్.. మామూలుగా లేదుగా!

Contract wedding: మన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లికి చాలా విలువ ఇస్తాం. తాళి కట్టి బంధువలందరి ముందూ చేసిన ప్రమాణాలే సాక్ష్యాలుగా భావించి జీవితాంతం కలిసుండాలని దీవిస్తాం. ఇవి కాకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లి, ప్రేమ పెళ్లి, రిజిస్ట్రేషన్ పెళ్లి, గుడిలో పెళ్లి లాంటివి కూడా చాలానే చూశాం. ఇప్పుడు ఓ కాంట్రాక్ట్ వెడ్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వారి వివాహ వేడుక తర్వాత… తమ ఒప్పందంపై వధూవరులిద్దరూ సంతకం చేశారు. ఇక ఆ కాంట్రాక్ట్ లో ఉన్న షరతులు తెలిస్తే షాకవ్వాల్సిందే.

ఎందుకంటే ఒప్పందం ప్రకారం… వధువు ప్రతీ రోజూ చీర ధరించాలి. అర్ధరాత్రి పార్టీలకు జీవిత భాగస్వామితో మాత్రమే వెళ్లాలని ఉంది. ఇప్పటి నయా కపుల్స్ కు ఈ రూల్స్ పాటించడం కాస్త కష్టమే మరి. అయినా సరే తమ పెళ్లి బంధాన్ని నిలుపుకోవాలంటే ఈ షరతులు పాటించాల్సిందే. అసోంకు చెందిన శాంతి, మింటు ఈ కాంట్రాక్ట్ వివాహం చేస్కున్నారు. పెళ్లి తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు వంటి అంచాలను పెద్ద కాగితంపై ముద్రించారు. ఇందులో ఆదివారం ఉదయం చేసుకోవాల్సిన అల్పాహారం గురించి, నెలకోసారి పిజ్జజా తినాలని, ఇంట్లో చేసిన వంటనే ప్రతిరోజూ భుజించాలని రాసుకున్నారు. కానీ వంట ఎవరు చేయాలన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఇద్దరూ కలిసే జిమ్ కి వెళ్లాలి, పార్టీలో మంచి మంచి ఫొటోలు దిగాలి, ప్రతి 15 రోజులకు ఒకసారి షాపింగ్ చేయాలి వంటి వాటిని కూడా అందులో చేర్చారు.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by 𝐖𝐞𝐝𝐥𝐨𝐜𝐤 𝐩𝐡𝐨𝐭𝐨𝐠𝐫𝐚𝐩𝐡𝐲 (@wedlock_photography_assam)

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel