Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Chandrababu : ఆయన విషయంలో చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? కారణమేంటి?

Chandrababu : ఏపీ రాజకీయాల్లో వరసగా ఓటములు చవి చూస్తున్న టీడీపీ పార్టీ.. ఇంకా కోలుకోవడం లేదు. మరో వైపు టీడీపీ పుంజుకోకుండా వైసీపీ పార్టీ అనేక వ్యూహాలు సైతం రచిస్తోంది. వైసీపీ అధికారం చేపట్టిన సమయంలో మండలిలో టీడీపీ బలం ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో టీడీపీని అణచివేసేందుకు మండలిని రద్దు చేస్తామంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి బిల్లు సైతం కేంద్రానికి పంపించారు. కానీ ఎందుకో తెలియదు కానీ ... Read more

By Vinod Kumar

Published on: November 29, 2021 10:25 AM

Updated on: November 29, 2021 10:25 AM

chandrababu-why-chandrababu-step-back-in-mla-vallabhaneni-vamsi-matter

---Advertisement---

Chandrababu : ఏపీ రాజకీయాల్లో వరసగా ఓటములు చవి చూస్తున్న టీడీపీ పార్టీ.. ఇంకా కోలుకోవడం లేదు. మరో వైపు టీడీపీ పుంజుకోకుండా వైసీపీ పార్టీ అనేక వ్యూహాలు సైతం రచిస్తోంది. వైసీపీ అధికారం చేపట్టిన సమయంలో మండలిలో టీడీపీ బలం ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో టీడీపీని అణచివేసేందుకు మండలిని రద్దు చేస్తామంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి బిల్లు సైతం కేంద్రానికి పంపించారు. కానీ ఎందుకో తెలియదు కానీ దానిని కేంద్రం పక్కనపెట్టింది. ప్రస్తుతం మండలిలో వైసీపీ బలం పెరగడంతో మండలి రద్దుపై వైసీపీ వెనక్కి తగ్గింది.. మండలి రద్దు బిల్లును ఇటీవలే ఉపసంహరించుకుంది.

ఇలా టీడీపీని దెబ్బకొట్టేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తూనే ఉంది. వారి వ్యూహాలకు చిక్కకుండా ఉండేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనలు చేస్తుండగానే.. సొంత పార్టీకి చెందనే నేతలో ఆయనకు మేకులా తయారవుతున్నారు. దీంతో చంద్రబాబుకు మరో తలనొప్పి వచ్చిపడింది. టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వంశీ ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబుపై.. అని కొడుకు లోకేశ్ పై అనేక వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడుతున్నాడు. మొన్న అసెంబ్లీలో జరిగిన ఘటనకు వంశీ చేసిన వ్యాఖ్యలే కారణం.

అయితే అతను టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అయినా.. చంద్రబాబు అతని విషయంలో చర్యలు తీసుకోకుండా ఎందుకు వెనకడుగు వేస్తున్నాడనే విషయం తెలియడం లేదు. అసెంబ్లీలో వంశీ టీడీపీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తే.. వాటితో తమకేం సంబంధమంటూ వైసీపీ నేతలు గుసగుసలు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే (వంశీ) వ్యాఖ్యల వల్లే పార్టీ, చంద్రబాబు ఇమెజ్ ప్రజల్లో తగ్గడానికి ఓ కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.  మరి వంశీ విషయంలో చంద్రబాబు ఎందుకు ఇంత మెతకగా వ్యవహరిస్తున్నారనేదే టీడీపీ పార్టీ నేతలకు సైతం అంతుపట్టడం లేదు.

Also Read : CM Etela Rajender : సీఎంగా ఈటల రాజేందర్.. అధ్యక్షా అంటూ…

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!