Google Chrome : గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక…

Google Chrome : ప్రపంచంలో ఎక్కువ మంది వాడే బ్రౌజర్‌గా గూగుల్‌ క్రోమ్‌ నిలుస్తోంది. కాగా గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను వాడే యూజర్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి తాజాగా హెచ్చరిక లను జారీ చేసింది. బ్రౌజర్‌లో లోపాలున్నాయని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం పేర్కొంది. తాజాగా గూగుల్‌ క్రోమ్‌లో నెలకొన్న లోపాలతో యూజర్లను హ్యకర్లు సులువుగా దాడి చేసే అవకాశం ఉందని ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఇండియ‌న్ కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఆర్బిట్ర‌రీ కోడ్‌ను ఉప‌యోగించుకొని హ్యాక‌ర్ గూగుల్ క్రోమ్ ద్వారా ఆయా ఫోన్లలోకి, కంప్యూటర్‌లోకి ప్ర‌వేశిస్తున్న‌ట్టు రెస్పాన్స్ టీమ్ పేర్కొంది.

అలానే గూగుల్‌ క్రోమ్‌బ్రౌజర్‌లో కొన్ని విభాగాల్లో లోపాలు ఉన్నట్లు సెర్ట్‌-ఇన్‌ గుర్తించింది. యూజ్ ఆఫ్టర్ ఫ్రీ ఇన్ సేఫ్‌ బ్రౌజింగ్‌, రీడర్ మోడ్, వెబ్ సెర్చ్, థంబ్‌నెయిల్ ట్యాబ్ స్ట్రిప్, స్క్రీన్ క్యాప్చర్, విండో డైలాగ్, పేమెంట్స్‌, ఎక్స్‌టెన్షన్స్‌, యాక్సెసిబిలిటీ అండ్‌ క్యాస్ట్‌ స్క్రీన్, ANGLEలో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో; పూర్తి స్క్రీన్ మోడ్, స్క్రోల్, ఎక్స్‌టెన్షన్స్ ప్లాట్‌ఫారమ్ అండ్‌ పాయింటర్ లాక్‌, COOPలో పాలసీ బైపాస్, V8లో అవుట్ ఆఫ్ బౌండ్స్ మెమరీ యాక్సెస్కాప్చర్ వంటివి లోపాలకు కారణమని సెర్ట్‌-ఇన్‌ పేర్కొంది. ఈ లోపాలతో సైబర్‌నేరస్తులు ఆయా క్రోమ్‌ యూజర్ల డేటాను తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది.

Advertisement

ఇక క్రోమ్ 98 బ్రౌజ‌ర్‌లో ఉన్న బ‌గ్స్‌ను ఇటీవ‌లే గూగుల్ ఫిక్స్ చేసింది. గూగుల్ క్రోమ్ 98 వ‌ర్ష‌న్‌కు వెంట‌నే అప్‌డేట్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ వ‌ర్ష‌న్ 98.0.4758.80 కంటే ముందు వ‌ర్ష‌న్ వాడుతున్న వాళ్లు మాత్రం వెంట‌నే అప్‌డేట్ చేసుకోవాలి. ఈ వ‌ర్ష‌న్‌ల‌లోనే బ‌గ్స్ ఉన్నాయి. విండోస్‌తో పాటు మాక్ ఓఎస్‌, లైనన్స్ యూజ‌ర్ల‌కు గూగుల్ క్రోమ్ 98 కొత్త అప్‌డేట్ వ‌ర్ష‌న్‌ను ఫిక్స్ చేసింది. దాంట్లో 27 సెక్యూరిటీ ఫిక్స్‌ల‌ను జ‌త‌చేసింది.

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel