Andhra Pradesh State : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ” అమరావతే ” అని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి…

Updated on: February 4, 2022

Andhra Pradesh State : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతే అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

ఏపీ రాజధాని విషయంలో సందిగ్ధం నెలకొందని, 3 రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న తర్వాత రాజధాని ఏదో తెలియడం లేదని నేడు రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ప్రకారం ఏపీ రాజధాని ఏది ? ఎవరు నిర్ణయం తీసుకోవాలి అని జీవీఎల్ ప్రశ్నించారు. ఇందుకు బదులుగా రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదేనని కేంద్రం తేల్చి చెప్పింది.

మొదట ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మాకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత 3 రాజధానులని, పాలనా రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్ కేపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి అని తర్వాత చెప్పారు.

Advertisement

ఆ బిల్లులను వెనక్కి తీసుకున్నట్టు మేం కూడా వార్తల ద్వారా తెలుసుకున్నాం. మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే” అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు.

Andhra Pradesh State Ys Jagan mohan Reddy
Andhra Pradesh State Ys Jagan mohan Reddy

ఇటీవలే జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాలమైన రీతిలో ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకే 3 రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంటున్నామని సీఎం జగన్ చెప్పారు. మరింత మెరుగైన ప్రతిపాదనలతో సభ ముందుకు కొత్త బిల్లును తీసుకువస్తామని స్పష్టం చేశారు.

మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగాగానీ, న్యాయపరంగా గానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరచేందుకు కోన్ సమయం పడుతుందన్నారు. మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు.

Advertisement

Read Also : మీ ఇంట్లో ఇవి ఉంటే.. అన్నీ శుభాలే.. చేతి నిండా డబ్బు..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel