5G Jio Phone : బంపర్ ఆఫర్ ఇస్తున్న జియో… అతి తక్కువ ధరలో 5జీ ఫోన్ ?

Updated on: January 28, 2022

5G Jio Phone : ప్రముఖ రిలయన్స్ జియో సంస్థ నుంచి సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను తీసుకురానున్నారు. అత్యంత చౌకైన ధరకే ఈ ఫోన్ భారతీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. 2022 ఏడాది నుంచే 5జీ విప్లవానికి జియో నాంది పలకనుంది. 5జీ టెక్నాలజీ విస్తరణలో రిలయన్స్ జియో ముందుడగు వేసింది. అందులో భాగంగానే అత్యంత చౌకైన ధరకే 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే తక్కువ ధరకే జియోఫోన్‌ నెక్స్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్‌ తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను జియో గూగుల్ భాగస్వామ్యంలో రూపొందించింది.

ఇప్పుడు త్వరలోనే అత్యంత చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ జియో లాంచ్ చేయనుంది. 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఇప్పటికే రియల్‌మీ, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లకు పోటీగా రిలయన్స్‌ జియో 5జీ స్మార్ట్‌ఫోన్‌ తీసుకొస్తోంది. ప్రస్తుతం 5జీ స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో రూ. 13 వేలకు అందుబాటులో ఉంది. అంతకంటే తక్కువ ధరకు 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్‌ జియో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ 5జీ  స్మార్ట్‌ఫోన్‌ దాదాపు రూ. 10 వేలకు అందుబాటులోకి రానుంది. 5జీ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్‌తో రానుంది. బడ్జెట్, మిడిల్ రేంజ్ ఫోన్లు కోరుకునే వినియోగదారులకు ఈ జియో 5G ఫోన్ పర్ ఫెక్ట్ అని చెప్పవచ్చు.

Advertisement

అంతే కాకుండా ఈ జియో 5జీ ఫోన్ ఎన్3, ఎన్5, ఎన్28, ఎన్40, ఎన్78 బ్యాండ్‌లకు సపోర్టు ఇస్తుంది. భారత మార్కెట్లోని అన్ని 5జీ నెట్‌వర్క్‌లకు సపోర్టు ఇస్తుంది. ఈ జియో ఫోన్ 4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో పాటు మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్‌తో వస్తుంది. హెచ్ డి+ రిజల్యూషన్‌తో 6.5- అంగుళాల ఎల్ సి డి తో రావచ్చు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది. 13-ఎంపీ ప్రధాన రియర్ కెమెరాతో పాటు 2 ఎంపీ కెమెరా, 8- ఎంపీ సెల్ఫీ కెమెరాతో రానుంది. ఫ్రంట్ సైడ్ 8 ఎంపీ కెమెరాతో రానుంది. సి పోర్ట్ ద్వారా ఛార్జింగ్‌కు సపోర్టు అందించనుంది. 5000 ఏంఏహెచ్ బ్యాటరీతో రానుంది. అలానే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రాకటంజా వెలువడకపోయిన త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel