Plants: ఈ మొక్కలు ఇంట్లో పెంచారంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని తప్పుతుంది..!

Plants: మనం ఇంట్లో అనేక రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. వాటిల్లో కొన్ని ఔషధ మొక్కలు కూడా ఉంటాయి. వాటి వల్ల కలిగే ఉపయోగాలు తెలియక వాటిని వినియోగించలేకపోతుంటారు చాలా మంది. అయితే ఇంట్లో పెంచే అనేక రకాల మొక్కలను ఆయుర్వేద మందుల తయారీల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఈ మొక్కలు హాని రహితమైనవి. వీటిని పెంచుకోవడం వల్ల అలాగే వాడడం వల్ల అనేక రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

తులసి మొక్కలో రామ తులి, కృష్మ తులసి, కర్పూర తులసి, వాన తులసి వంటి నాలుగు రకాల మొక్కలు ఉంటాయి. కర్పూర తులసిని ఎక్కువగా బాహ్య ప్రయోజనాల కోసం వాడుతుంటారు. కర్పూర తులసి నుంచి తీసిని నూనెను చెవి ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు వాడతారు. నిద్రలేమి, జలుబు, దగ్గు, దమ్ము వంటి శ్వాస సంబంధిత సమస్యలను నయం చేయడంలోనూ తులసి ముందు ఉంటుంది.

Advertisement

అలాగే మెంతి ఆకులు కూడా చాలా మంచివి. వీటిని కూడా ఇంట్లోనే పెంచుకోవచ్చు. కడుపులో మంట, ఆల్సర్ వంటి వాటని తగ్గించడంలో మెంతి కూర ఎప్పుడూ ముందుంటుంది. నిమ్మకాయ చెట్టు, కలబంద కూడా చాలా మంచివి. వీటిని ఇంట్లో ఫెంచుకోవడం వల్ల అనేక రకాల సమస్యలను తొలగించుకోవచ్చు.

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

నేను వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. 2016లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలో అడుగుపెట్టాను. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటాను.

Read More

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel