Plants: ఈ మొక్కలు ఇంట్లో పెంచారంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని తప్పుతుంది..!

Plants: మనం ఇంట్లో అనేక రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. వాటిల్లో కొన్ని ఔషధ మొక్కలు కూడా ఉంటాయి. వాటి వల్ల కలిగే ఉపయోగాలు తెలియక వాటిని వినియోగించలేకపోతుంటారు చాలా మంది. అయితే ఇంట్లో పెంచే అనేక రకాల మొక్కలను ఆయుర్వేద మందుల తయారీల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఈ మొక్కలు హాని రహితమైనవి. వీటిని పెంచుకోవడం వల్ల అలాగే వాడడం వల్ల అనేక రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

తులసి మొక్కలో రామ తులి, కృష్మ తులసి, కర్పూర తులసి, వాన తులసి వంటి నాలుగు రకాల మొక్కలు ఉంటాయి. కర్పూర తులసిని ఎక్కువగా బాహ్య ప్రయోజనాల కోసం వాడుతుంటారు. కర్పూర తులసి నుంచి తీసిని నూనెను చెవి ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు వాడతారు. నిద్రలేమి, జలుబు, దగ్గు, దమ్ము వంటి శ్వాస సంబంధిత సమస్యలను నయం చేయడంలోనూ తులసి ముందు ఉంటుంది.

Advertisement

అలాగే మెంతి ఆకులు కూడా చాలా మంచివి. వీటిని కూడా ఇంట్లోనే పెంచుకోవచ్చు. కడుపులో మంట, ఆల్సర్ వంటి వాటని తగ్గించడంలో మెంతి కూర ఎప్పుడూ ముందుంటుంది. నిమ్మకాయ చెట్టు, కలబంద కూడా చాలా మంచివి. వీటిని ఇంట్లో ఫెంచుకోవడం వల్ల అనేక రకాల సమస్యలను తొలగించుకోవచ్చు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel