marriage : జీవితంలో మీ కంటే పెద్దవారిని పెళ్లి చేసుకుంటున్నారా..? ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

marriage : మన తాతలు, నాన్నల కాలంలో పెళ్లిళ్లు అనగానే ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ కనిపిస్తుంది. సరాసరి 5 నుంచి 12 ఏళ్ల వయస్సు తేడాతో వివాహాలు జరిగేవి. అప్పట్లో అమ్మాయిలు పెద్దమనిషి కాగానే పెళ్లిళ్లు చేసేవారు. అంతేకాకుండా వయస్సు మధ్య తేడాలను అస్సలు పట్టించుకునే వారు కాదని తెలిసింది. అబ్బాయి మంచోడా కాదా.. బాగా సంపాదిస్తున్నాడా.. ఆస్తి పాస్తులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవారట.. ఇక ఒకరికొకరు నచ్చడం అనే కాన్సెంప్ట్ ఆ రోజుల్లో పెద్దగా ఉండేవి కావనుకో.. కానీ ఇప్పుడు మాత్రం  ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ విషయాన్ని పేరెంట్స్ కచ్చితంగా ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు సరిగా కాకపోవడమే మెయిర్ రీజన్ అని తెలుస్తోంది.

problems-faced-by-married-couples-with-huge-age-differences
problems-faced-by-married-couples-with-huge-age-differences
ఏజ్ గ్యాప్ మ్యారేజ్..
ప్రస్తుతం జరుగుతున్న మ్యారేజెస్‌లో ఏజ్ గ్యాప్ పెద్దగా కనిపించడం లేదు. అమ్మాయి, అబ్బాయి మధ్య ఐదేండ్ల గ్యాప్ మాత్రమే ఉండేలా సంబంధాలు చూస్తున్నారు.. ఒకే చేసేస్తున్నారు. ఒకవేళ గనుక మీరు మీ కంటే కొంచెం వయస్సు ఎక్కువగా ఉన్న అమ్మాయిని లేదా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే..  ముందుగా కొన్ని విషయాలు వారి వద్ద ఓపెన్ అవ్వడం మంచిది. ఏజ్ విషయం ఎలాగూ తెలుస్తుంది కావున.. మిగతా వాటి విషయంలో ఒకరొనొకరు నొప్పించుకోకుండా ఉండాలి. అలవాట్లు, టెస్టులు, ఇష్టాలు ముందే తెలుసుకోవాలి. ఒకరికి నచ్చని విషయం గురించి ఇంకొకరు అసలే మాట్లాడొద్దు. అభిప్రాయాలు పంచుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయాన్ని ఎక్కువగా కేటాయించడం.. వీలైతే ఇద్దురూ కలిసి  ట్రావెలింగ్ చేయండి. ఇలా చేస్తే బంధం బలపడొచ్చు. అప్పుడు ఏజ్ పెద్ద మ్యాటర్ కానేకాదు..
సీక్రెట్స్ ఉండొద్దు…

కొందరికి తన కంటే ఏజ్‌లో పెద్దవారిని చేసుకున్నామని ఫీలింగ్ ఉంటుంది. అలాంటి వారు జాబ్ లొకేషన్ లేదా బయట తన ఏజ్ వారితో ఎక్కువగా స్నేహం చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే, ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే వదిలేసుకోవాలి. ఏజ్ విషయాన్ని పదే పదే ఆమె/అతడు  గుర్తుచేయరాదు. బెడ్ రూం విషయాల్లో ఓపెన్‌గా ఉండాలి. మీ భాగస్వామికి ఏదైనా తెలియపోతే చెప్పే ప్రయత్నం చేయండి.. చిన్న చూపు చూడొద్దు..కించపరిచే మాటలు అనొద్దు.. ఇద్దరి మధ్య షేరింగ్ తప్పనిసరి. లేనియెడల ఇద్దరి మధ్యలో గొడవలు, మనస్పర్దలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దీంతో దాంపత్య జీవితం నరకంగా మారుతుంది.

Read Also : Marriage Relationship : ఫస్ట్ నైట్ ఆ కార్యం చేసేటప్పుడు.. మగవారు తెగ ఆలోచిస్తారట.. ఎందుకో తెలుసా..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel