Health Tips: ఈ సందర్భాలలో అధికంగా నీళ్లు తాగితే… ప్రమాదంలో పడినట్లే!

Health Tips: సాధారణంగా మన శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరగాలంటే మన శరీరానికి తగిన మోతాదులో నీరు ఎంతో అవసరం. అందుకే రోజుకు 7 నుంచి 8గ్లాసుల వరకు నీటిని తాగాలని సూచిస్తుంటారు.ఇలా నీటిని తాగడం వల్ల మన శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరగడమే కాకుండా ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటాము. అయితే కొన్నిసార్లు మనం అధికంగా నీటిని తాగటం వల్ల కూడా ప్రమాదకరమని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాలలో నీళ్లు తాగకపోవడం మంచిది. మరి ఆ సందర్భాలు ఏమిటి అనే విషయానికి వస్తే….

మన శరీరానికి నీటి అవసరం ఎంతో ఉంది అలా అని అవసరానికి మించి అధికంగా నీటిని తాగటం వల్ల మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అధిక మొత్తంలో నీటిని తాగటం వల్ల మూత్రపిండాలు కాలేయం గుండె వంటి శరీర భాగాలపై నీరు ప్రతికూల ప్రభావాన్ని చూపు తుంది కనుక పరిమిత మోతాదులో నీటిని తీసుకోవడం ఎంతో ఉత్తమం.

ఇక మన యూరిన్ పూర్తి తెలుపు రంగులో వస్తే మనం అవసరానికి మించిన నీటిని తాగుతున్నామని అర్థం. అలాంటి సమయంలో మనం మూడు లీటర్ల కంటే అధికంగా నీటిని తాగకూడదు.ఎప్పుడూ కూడా మూత్రం లేత తెలుపు రంగులో ఉంటేనే మనం సరైన మోతాదులో నీటిని తీసుకుంటున్నామని నిపుణులు తెలియజేస్తున్నారు.ఇక చాలామంది ఆహారం తిన్న వెంటనే గబగబా నీళ్లు తాగుతుంటారు ఇలా చేయడం చాలా తప్పు అని నిపుణులు చెబుతున్నారు.ఇలా అన్నం తిన్న వెంటనే నీటిని తాగటం వల్ల జీర్ణ రసాల సామర్థ్యం తగ్గి ఆహారం సరిగా జీర్ణం కాదు దీంతో జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.ఇక చాలామంది వ్యాయామం చేసిన వెంటనే అధిక దాహం వేయటం వల్ల నీటిని తాగుతుంటారు అయితే వ్యాయామం చేసిన తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు. వ్యాయామం చేసిన తర్వాత మన శరీరం నుంచి ఎలక్ట్రోలైట్స్ విడుదల అవుతాయి కనుక నీటికన్నా పండ్లరసం కొబ్బరినీళ్లు లేదా నిమ్మరసం తాగడం మంచిది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel