Health Tips : సున్నిపిండి తో స్నానం చేస్తున్నారా… అయితే ఇది తెలుసుకోండి!

Health Tips : అందానికి అందరూ దాసోహం అవ్వక తప్పదు పెద్ద వారు నుంచి చిన్నారుల వరకు మృదువైన మెరిసే చర్మా కొరకు మార్కెట్ లో దొరికే వివిధ రకములైన క్రీమ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వాటిని ఉపయోగించడం వలన కొంతకాలం పాటు అందంగా కనిపిస్తూ ఉంటారు. అయితే అవి ఎప్పుడూ ఉపయోగించడం ఆపుతారు మళ్లీ సమస్య మొదలైందంటే. అందమైన చర్మం కోసం మనం వంటింట్లో ఉండే వాటితోనే అందమైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు. అదేంటో తెలుసుకోవాలంటే చదివేయండి మరి.

మన అమ్మమ్మల కాలం నుండి సున్నిపిండితో స్నానం చేసేవారు. కాలం మారుతుంది పద్ధతులు మారిపోయాయి సున్నిపిండి వాడకం కూడా తగ్గిపోయింది. బాత్​సోప్స్​ వచ్చాక ఈ బాత్​పౌడర్​ను చాలామంది మర్చిపోయారు. సున్నిపిండి ఉపయోగించడం వలన స్కిన్​ మీది డెడ్​సెల్స్​ పోయి చర్మం మెరుస్తూ, ఆరోగ్యంగా కనిపిస్తుంది. అయితే సున్నిపిండిని చాలా ఈజీ గా తయారు చేసుకోవచ్చు. బియ్యం, శనగపప్పు, మినుములు, పెసలను కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేయాలి. తరువాత ఎండుకర్జూర, కర్పూరం వేసి మళ్లీ ఒకసారి గ్రైండ్​ చేస్తే బాత్​పౌడర్​ రెడీ.

Advertisement

ఈ పొడిలో నువ్వులనూనె వేసి మరీ తడిగా లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి మసాజ్​ చేసుకోవాలి. చివర్లో చర్మానికి కొంచెం నువ్వుల నూనె రాయాలి. లేదంటే ఆవుపాల మీద మీగడ వాడొచ్చు. ఇలా వారానికోసారైనా నలుగు పెట్టుకుంటే బాగుంటుంది. కావాలంటే పసుపు కలపొచ్చు. ఇలా వారానికోసారైనా నలుగు పెట్టుకుంటే అందమైన మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel