health tips : బాదం పొట్టుతో కలిపి తింటే కలిగే ప్రయోజనాలు..

health tips : చాలామంది బాదం పొట్టుని తీసి తింటారు. కానీ బాదం లో ఉండే పోషకాలు బాదం పొట్టు లో కూడా ఉంటాయని ఎవరికీ తెలియదు. బాదం పొట్టులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా చర్మం నిగారింపుకి అలాగే జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి తోడ్పడతాయి.చాలామంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు
వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడంలో ఇంట్రెస్టు చూపిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ డ్రై ఫ్రూట్స్ నీ వాళ్ళ డైట్ లో చేర్చుకుంటున్నారు. అయితే చాలా మందికి బాదం రాత్రి నానబెట్టి ఉదయాన్నే పొట్టుతీసి తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది.

Health Benefits Of Almond Peel
Health Benefits Of Almond Peel

బాదం లో ఫైబర్, ప్రోటీన్, క్యాల్షియం, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడు ,కళ్లు ,ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది మెదడు చురుకుగా పని చేయడంలో తోడ్పడుతుంది. రక్తహీనత రాకుండా అడ్డుకుంటుంది. ఎముకలు దంతాలు బలంగా మారేలా చేస్తుంది. బాదం తినడం వల్ల గుండె, మధుమేహం, బలహీనత, శ్వాసకోశ వంటి సమస్యలను దూరం చేయవచ్చు. అలాగని బాదం పొట్టు తీసేసి తినడం వల్ల మనం చాలా నష్టపోతామని నిపుణులు చెబుతున్నారు.

కడుపుకి మంచిది : బాదం పొట్టులో ఫైబర్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. కడుపుని క్లియర్ చేయడంలో సహాయపడతాయి. బాదం పొట్టు ని అవిసె గింజలు, పుచ్చకాయ గింజలతో గ్రైండ్ చేసి ఆ పొడిని పాలలో వేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

చర్మం మెరుస్తుంది : బాదం పొట్టు చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిలోని విటమిన్ ఇ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఒక కప్పు బాదం పొట్టుని, కొద్దిగా ఓట్స్, కొద్దిగా శెనగపిండి, సగం కప్పు కాఫీ పొడితో గ్రైండ్ చేసి ఆ పొడిని పెరుగులో కలిపి ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

జుట్టుకు మంచిది : బాదం పొట్టు లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బాదం పొట్టు, గుడ్లు, కొబ్బరి నూనె, అలోవెరా జెల్ తో కలిపి హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు మెరవడమే కాకుండా చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది.

Read Also : Hair Problems: జుట్టు నల్లగా, ఒత్తుగా కావాలంటే ఈ నూనె రాయాల్సిందే..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel