వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Thyroid: థైరాయిడ్ కేవలం ఆడవారికి మాత్రమే వస్తుందా?మగవారికి రాదా? నిపుణులు ఏమంటున్నారంటే?

Thyroid: ప్రస్తుత కాలంలో ప్రతి పది మందిలో ఒకరు బాధపడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య ఒకటి. థైరాయిడ్ గ్రంథులు ప్రతి ఒక్కరికి మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఈ థైరాయిడ్ గ్రంథులు ఉంటాయి. అయితే ఈ గ్రంథుల నుంచి మన శరీరంలో ప్రతి కణానికి ప్రతి శరీర భాగానికి అవసరమయ్యే హార్మోన్లు విడుదల అవుతూ ఉంటాయి.అయితే ఈ గ్రంధి నుంచి ఎక్కువ మొత్తంలో లేదా తక్కువ మొత్తంలో హార్మోన్లు విడుదలైన అది మన ఆరోగ్యానికి ప్రమాదకరమనీ ... Read more

By Ramesh Babu

Published on: May 27, 2022 4:30 PM

Updated on: May 27, 2022 4:19 PM

---Advertisement---

Thyroid: ప్రస్తుత కాలంలో ప్రతి పది మందిలో ఒకరు బాధపడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య ఒకటి. థైరాయిడ్ గ్రంథులు ప్రతి ఒక్కరికి మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఈ థైరాయిడ్ గ్రంథులు ఉంటాయి. అయితే ఈ గ్రంథుల నుంచి మన శరీరంలో ప్రతి కణానికి ప్రతి శరీర భాగానికి అవసరమయ్యే హార్మోన్లు విడుదల అవుతూ ఉంటాయి.అయితే ఈ గ్రంధి నుంచి ఎక్కువ మొత్తంలో లేదా తక్కువ మొత్తంలో హార్మోన్లు విడుదలైన అది మన ఆరోగ్యానికి ప్రమాదకరమనీ చెప్పాలి.అయితే థైరాయిడ్ సమస్య ఎక్కువగా మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువగా ఉంటుందని ఈ సమస్య మగవారిలో ఉండదని చాలా మంది అపోహపడుతుంటారు.

అయితే థైరాయిడ్ సమస్య అనేది ఆడవారితో పాటు మగవారిలో కూడా ఉంటుంది. ఈ థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు మన శరీరంలో వివిధ రకాల మార్పులు కనబడతాయి. థైరాయిడ్ రెండు రకాలుగా మనకు వ్యాప్తి చెందుతుంది.1 హైపో థైరాయిడిజం 2. హైపర్ థైరాయిడిజం సాధారణంగా మనం ఎక్కువగా హైపో థైరాయిడిజం ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్యతో బాధపడే వారు అధికంగా శరీర బరువు పెరుగుతుంటారు.

ఇక హైపర్ థైరాయిడిజంతో బాధపడేవారు శరీర బరువు అమాంతం తగ్గిపోతారు.అలాగే మెడ చుట్టూ వాపు ఉంటుంది. హైపోథైరాయిడ్ సోకినప్పుడు శరీర బరువు తగ్గి పోవడమే కాకుండా శరీరంలోని వివిధ భాగాలు తొందరగా అలసిపోయి నీరసించిపోతాయి. తొందరగా చెమటలు పట్టడం, చర్మం పొడిబారడం, కాళ్లు చేతులు వాపులు రావడం, మానసిక ఎదుగుదల లేకపోవడం వంటి లక్షణాలు మగవారు ఆడవారు ఇద్దరిలోనూ కనపడతాయి. ఇకపోతే ఆడవారు ఈ సమస్యతో బాధపడేటప్పుడు నెలసరి సక్రమంగా రాదు. అదేవిధంగా గర్భధారణ సమయంలో కూడా సమస్యలు తలెత్తుతాయి.అందుకే సరైన ఆహారం తీసుకుంటూ శారీరక వ్యాయామాలు చేయడం వల్ల ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel